Breaking News

నేతన్న కంట కన్నీళ్లు

Published on Mon, 12/16/2024 - 04:29

చీరాల:  ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతలకు పుట్టినిల్లు చీరాల ప్రాంతం. చీరాలతోపాటు పొద్దుటూరు, జమ్మలమడుగు, పెడన, ఐలవరం, బద్వేలు, ఆత్మకూరు, తాటిపర్తి వంటి ప్రాంతాల నుంచి 40 ఏళ్ల కిందట వలసలు వచ్చిన కార్మికులు స్థానికంగా మాస్టర్‌ వీవర్లకు సంబంధించిన చేనేత షెడ్డుల్లోని మగ్గాలపై పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో మొత్తం 50 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు.  

జీఎస్టీ రద్దు హామీ అమలయ్యేనా..? 
మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారింది. చేనేత వృత్తులు చేసే వారికి 29 శాతం జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పినా అమలయ్యేలా లేదు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపుపై నేటికీ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. చేనేతలు కూటమి సర్కారులో మేలు జరగకపోగా చేనేతలు కునారిల్లుతున్నారు. చేనేత వృత్తిలో రాణించలేక చివరకు కారి్మకులు ఇతర వృత్తుల వైపు తరలిపోతున్నారు. 

కరువైన నేతన్న నేస్తం..  
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బడ్జెట్‌లో చేనేతలకు రూ.200 కోట్లు కేటాయింపుతోపాటుగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు అందించారు. చేనేతలకు పూర్వ వైభవం తీసుకువచ్చి నేతన్నల తలరాత మార్చేందుకు చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.94 లక్షల కోట్లలో చేనేత రంగానికి నామమాత్రంగా 0.066 శాతం కేటాయించారని కారి్మక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.  

కలగానే చేనేత పార్కు..  
చేనేతలు అధికంగా ఉన్న చీరాల ప్రాంతంలో 50 ఎకరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చీరాల వచ్చిన సందర్భంగా నమ్మబలికారు. నేటికీ ఆ ఊసే లేకుండా పోయింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన సదస్సుకు ఆ శాఖ మంత్రి సవిత హాజరై చేనేతల కోసం అనేక పథకాలు రచించామని చెప్పారే తప్ప టెక్స్‌టైల్స్‌ పార్కు గురించి ప్రస్తావించలేదు. చేనేత వృత్తి చేసే కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ నేటికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు లేవు.  

కనీస వేతన చట్టానికి దిక్కేది? 
కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్‌ వర్క్‌ చేస్తున్నారనే కారణంతో కూలి ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్‌లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కారి్మకుడికి కూలి తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కారి్మకులకు ప్రయోజనం ఉంటుంది.  

నిధులు విడుదలైతే పార్కు పనులు ప్రారంభిస్తాం 
హ్యాండ్‌లూమ్‌ పార్కుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే పార్కు పనులు ప్రారంభిస్తాం. మగ్గం కార్మికులకు 200 విద్యుత్‌ యూనిట్లపై మార్గదర్శకాలు అందలేదు. నేతన్న నేస్తం ద్వారా ఒక్కో కార్మికుడికి అందాల్సిన రూ.24 వేలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తే కార్మికుడికి అందిస్తాం. ఆప్కో ద్వారా కొంత మేర స్వయం సహకార సంఘాల ద్వారా కొనుగోలు ఇప్పుడే ఇప్పుడే మొదలుపెడుతున్నాం.  – నాగమల్లేశ్వరరావు, హ్యాండ్‌లూమ్, ఏడీ   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)