Breaking News

9 శాతం పడిపోయిన జీఎస్టీ వసూళ్లు

Published on Sun, 11/02/2025 - 05:59

సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబరు నెలలో తొమ్మిది శాతం క్షీణించాయి. శ్లాబ్‌ రేట్ల సవరణ తర్వాత దేశవ్యాప్తంగా రెండు శాతం వృద్ధి నమోదవగా ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణలో 10 శాతం చొప్పున, తమిళనాడులో 4 శాతం పెరుగుదల ఉండడం గమనార్హం.

రాష్ట్రంలో అక్టోబరు జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే రూ.3,815 కోట్ల నుంచి రూ.3,490 కోట్లకు పడిపోయాయి. నికర వసూళ్లు కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2023తో పోలిస్తే తగ్గాయి. 2023 అక్టోబరులో రూ.3,098 కోట్లుండగా... ఈ ఏడాది అక్టోబరులో రూ.3,021 కోట్లకే పరిమితమయ్యాయి. 

⇒  శ్లాబుల సవరణ తర్వాత పొరుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగ్గా ఒక్క ఏపీలోనే తగ్గాయి. అక్టోబరులో తెలంగాణ గ్రాస్‌ జీఎస్టీ వసూళ్లలో 10 శాతం వృద్ధి (రూ.5,211 కోట్ల నుంచి రూ.5,726 కోట్లకు) కనిపించింది. కర్ణాటకలో రూ.13,030 కోట్ల నుంచి రూ.14,395 కోట్లకు పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా గ్రాస్‌ జీఎస్టీ వసూళ్లు రూ.1.42 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి. 

⇒ ఏప్రిల్‌–అక్టోబరు మధ్య ఏపీలో జీఎస్టీ వసూళ్లు గత ఏడాది కంటే కేవలం 2.7 శాతం పెరిగి రూ.27,059 కోట్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 7.8 శాతం వృద్ధి నమోదైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)