Breaking News

నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌16 ప్రయోగం

Published on Wed, 07/30/2025 - 05:30

తిరుమల/శ్రీకాళహస్తి/సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ (నిసార్‌) అనే ఉపగ్రహాన్ని బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణన్‌ ఆధ్వర్యంలో కౌంట్‌డౌన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

జియో సింక్రనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌16) రాకెట్‌ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్‌ను ప్రవేశపెట్టనున్నారు. భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్లు పాటు సేవలు అందిస్తుంది.  

భవిష్యత్తులో ఇస్రో–నాసా కలిసి మరిన్ని ప్రయోగాలు.. 
ఇస్రో, నాసా బంధం బలపడి రాబోయే కాలంలో మరో మూడు ప్రయోగాలను సంయుక్తంగా నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణన్‌ పేర్కొన్నారు. అలాగే, చంద్రయాన్‌–4 ప్రయోగ పనులకు శ్రీకారం చుడు­తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి గగన్‌యాన్‌–1 పేరుతో ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌­లో కూడా మరో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాకెట్‌ నమూనాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని, సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించు­కున్నారు. జీఎస్‌ఎల్‌వీ ఎప్‌16 ప్రయోగం విజ­యవంతం కావాలని పూజలు చేశారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)