Breaking News

28న జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌12 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Published on Sat, 05/27/2023 - 04:40

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉద­యం 10.42 గంటలకు జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ శాటిలైట్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌12) ప్రయోగించేందుకు ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్‌ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ప్రయోగానికి 27.30 గంటల ముందు కౌంట్‌డౌన్‌ నిర్వహిస్తారు.

అయితే శనివారం ఎంఆర్‌ఆర్‌ సమావేశం, లాబ్‌ సమావేశం అనంతరం కౌంట్‌డౌన్‌ సమయం, ప్రయోగ సమయం అధికారికం­గా ప్రకటించనున్నారు. శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశం నిర్వహించారు.  రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసి ఎంఆర్‌ఆర్‌ సమావేశం నిర్వహించిన అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) వారికి అప్పగించారు.

లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో మరో­మారు ల్యాబ్‌ సమావేశం నిర్వహించారు.  జీఎస్‌ఎల్‌వీ ఎప్‌12 రాకెట్‌కు సంబంధించి లాంచ్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. 26 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం 10.42 గంటలకు 2,232 కిలోలు బరువు కలిగిన నావిక్‌–01 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌  నింగి వైపుకు దూసుకెళ్లేందుకు షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై సిద్ధంగా వుంది.

కలాం స్ఫూర్తితో శాస్త్రవేత్తలుగా ఎదగాలి
మిసైల్‌మ్యాన్‌ ఏపీజే అబ్దుల్‌కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పిలుపునిచ్చారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ కేంద్రంలోని బ్రహ్మప్రకాష్‌ హాలులో దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన ఈ ఏడాది పదో తరగతిలోకి వెళ్లనున్న విద్యార్థులు 56 మందిని ఎంపిక చేసి యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రాంలో భాగంగా యువికా–2023 కార్యక్రమానికి ఆహ్వానించి తీసుకొచ్చారు.

శుక్రవారం ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌తో వర్చువల్‌ పద్ధతిలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సుమా రు గంటకు పైగా సమాధానాలు ఇచ్చి వారిని ఉత్తేజ పరిచారు. అనంతరం చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ మా ట్లాడుతూ ఈ తరం విద్యార్థులు ఎంతో తెలివైన వారని, వారిలో దాగివున్న సృజనాత్మకతను బయటకు తీస్తే మంచి పౌరులుగా తయారవుతారని తెలిపారు.

నేటి తరం విద్యార్థులు స్పేస్‌ టెక్నాలజీ వైపు రాకుండా ఇతర రంగాలవైపు మొగ్గు చూపుతు న్న నేపథ్యంలో వారిని స్పేస్‌ సైన్స్‌ వైపు మళ్లించేందుకు యువ విజ్ఞాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామ ని చెప్పారు. రాకెట్లు, ఉపగ్రహాలు, ఆర్బిట్లు అనే వి మేథమేటిక్స్‌తో ఎక్కువగా ముడిపడి ఉంటా యని అన్నారు. అందుకే మేథమేటిక్స్‌లో మంచి ప్రావీ ణ్యం ఉంటే ఇస్రో శాస్త్రవేత్తలుగా రావడానికి ఎంతో వీలుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్, షార్‌ కంట్రోలర్‌ శ్రీని వాసులురెడ్డి, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆర్‌.వెంకట్రా మన్, గ్రూప్‌ డైరెక్టర్‌ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)