Breaking News

కవరు కట్టు.. లాభాలు పట్టు

Published on Mon, 04/21/2025 - 05:15

రాయచోటి జగదాంబసెంటర్‌: పండ్లలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం, తద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మామిడి, జామ, దానిమ్మ, డ్రాగన్‌ ఫ్రూట్స్‌ తదితర పండ్ల తోటలు విస్తృతంగా సాగవుతున్నాయి. వీటిలో చెక్కగుజ్జుతో తయారైన పేపరు సంచులను వినియోగించడం ద్వారా నాణ్యమైన ఫలసాయం పొందే వీలుంది. 

పేపరు సంచులను కాయలకు గాలి చొరబడకుండా కడితే వంద శాతం నాణ్యతను పెంపొందించుకున్నట్లే. అన్నమయ్య జిల్లాలో మామిడి తోటలు దాదాపు 33 వేల హెక్టార్లలో సాగు కాగా.. వీటిలో దిగుబడి 30 నుంచి 40 శాతం మాత్రమే వచ్చాయి. ఈ పేపరు సంచుల ద్వారా పండించిన పండ్లు విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో ఉంటాయని చెబుతున్నారు. గతేడాది అనేక మంది రైతులు ఫ్రూట్‌ కవర్లు వినియోగించి అధిక ధరలు పొందారు.

అధిక ఉష్ణోగ్రతలతో రాలిన పూత, పిందె 
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు మామిడిపై తీవ్ర దు్రష్పభావం చూపాయి. మొదట్లో పూత, పిందె బాగున్నా.. అధిక ఉష్ణోగ్రతలు మామిడి రైతుల ఆశలను రాల్చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు దంచి కొడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల రైతుల కళ్ల ముందే 60–70 శాతం పూత, పిందె రాలిపోయాయి. ఈ పరిస్థితుల్లో అంతంత మాత్రంగా ఉన్న దిగుబడులను కాపాడుకోవడంతోపాటు నాణ్యను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం ఫ్రూట్‌ కవర్ల వినియోగం ఊరటనిచ్చింది.

ఏ పండ్లకు వాడవచ్చు.. 
» జామలో థైవాన్‌ గోవా పిందె ఏర్పడిన 20–25 రోజుల తర్వాత ఒక్కొక్క పిందెకు ఒక్కొక్క తెల్ల రంగు సంచి వాడాలి. 60 రోజు తర్వాత కాయలను కోయవచ్చు. 
» దానిమ్మలో పిందె ఏర్పడ్డాక.. ఒక్కొక్క పిందెకు ఒక్కో తెల్లరంగు సంచి వాడాలి. 90 రోజుల తర్వాత కాయలను కోయాలి. 
» ద్రాక్షలో గుత్తులు ఏర్పడిన 60 రోజుల తర్వాత ఒక్కో గుత్తికి ఒక్కో తెల్లరంగు సంచి వినియోగించాలి. 50 రోజుల తర్వాత గుత్తులను కోసుకోవాలి. 

పురుగుల నుంచి రక్షణ: ఫ్రూట్‌ కవర్‌ వినియోగంతో మంగు, మచ్చలు, మంచుపురుగు, ముడ్డిపుచ్చు, టెంక పురుగు, మకరం, ఈగలు మొదలగు వాటిని నియంత్రించి నాణ్యమైన పండ్ల దిగుబడికి తోడ్పడుతుంది. పిందె దశలో అంటే నిమ్మకాయ, కోడిగుడ్డు పరిమాణంలో ఉన్నపుడు వాడాలి. మంచి పలక పిందెలను సంచిలో పెట్టి 3 సెంటీమీటర్ల పైన తొడిమకు, సంచికి ఉండే తీగను గాలి చొరబడకుండా కట్టాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)