Breaking News

పేదోడి ప్రొటీన్‌ నత్త కూర

Published on Sat, 05/31/2025 - 03:42

మలికిపురం:  నత్త.. నెమ్మదిగా కదిలే జీవి. వీటిని బద్ధకానికి సూచికగా భావిస్తారు. కానీ.. ఇది వేసే ప్రతి చిన్న అడుగు అర్థవంతమైన విజయాలకు దారి తీస్తుందని భావించే వారూ లేకపోలేదు. జీవితంలో తొందరపడకుండా.. సమయం తీసుకోవడమనే ప్రాముఖ్యతను నత్త నొక్కి చెబుతుంది. ఈ విషయాలు పక్కన పెడితే నత్తల వల్ల మానవాళికి అనేక ఉపయోగాలున్నాయి. 

నత్తలను వ్యవసాయ క్షేత్రాల్లో రక్షకులుగా రైతులు, వ్యవసాయ అధికారులు భావిస్తారు. క్రిమికీటకాల నుంచి పంటలను కాపాడతాయని విశ్వసిస్తారు. నత్త గుల్లలను సేకరించి ప్రత్యేక బట్టీలలో కాల్చి సున్నంగా వినియోగిస్తారు. కోస్తా జిల్లాల ప్రజలు నత్త మాంసాన్ని పేదోడి ప్రొటీన్‌గా భావిస్తారు. చికెన్, మటన్‌ మాదిరిగా నత్త మాంసంతో కూరలు వండుకుని ఆరగిస్తారు. 

కాలువలు.. పొలాలే వీటి ఆవాసం 
పొలాలు, బోదెలు, కాలువలు, చెరువుల్లో నత్తలు విరివిగా పెరుగుతాయి. పదేళ్లుగా కోనసీమలో పలుచోట్ల క్రాప్‌ హాలిడే పాటిస్తుండటం వల్ల ఆ పొలాల్లో నత్తల పెరుగుదల అధికంగా ఉంది. అనేక మంది నత్తల్ని సేకరించి మాంసం తీసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. 

దశాబ్దాల కాలంగా నత్త మాంసం విక్రయాలు జరుగుతున్నా.. ఇటీవల కాలంలో స్టార్‌ హోటళ్లలో నత్త మాంసంతో చేసే కూరలకు డిమాండ్‌ పెరిగింది. నత్త మాంసంతో పలు రుచికరమయిన వంటలు తయారవుతున్నాయి. సాధారణంగా శనగపప్పు కాంబినేషన్‌లో వండుతారు. ఇప్పుడు మామిడి కాయలు, జీడిపప్పు, చింత చిగురు కాంబినేషన్‌లో నత్త కూర వండుతున్నారు.  

విదేశాల్లో  నత్తల పెంపకం 
ఫ్రాన్స్, వియత్నాం, పోర్చుగల్, బల్గేరియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో నత్తలను ఆహారంగా వినియోగిస్తున్నారు. సాగు ప్రయోజనాలతో పాటు ఆహారం కోసం నత్తల్ని పెంచటాన్ని ‘హెలిసి కల్చర్‌’గా పిలుస్తారు. స్పెయిన్‌లోని లైడా నగరంలో ఏటా వసంత కాలంలో ‘లా అప్లెక్‌ డెల్‌ కారాగోల్‌’ పేరిట ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. 

ఇక్కడ కేవలం నత్తలతో చేసిన వంటకాలను మాత్రమే వడ్డిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది ఆహార ప్రియులు ఇక్కడికొచ్చి హాజరై నత్తల వంటకాలను లొట్టలేసుకుని ఆరగిస్తారు. నత్తలను రుచికర ఆహారంగా తినడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పలు వర్గాలలోని చాలా మందికి ప్రొటీన్‌ అందించే ఆహారంగా వీటికి పేరుంది.  

నత్తల్లో ఉండే పోషకాలు 
నత్తల్లో 82 శాతం వరకూ నీరు ఉంటుంది. కొవ్వు తక్కువ. చేపల్లో మాదిరిగా ఒమేగా–3 ఆమ్లాలు ఉంటాయని, ఇవి గుండెకు మంచిదని వైద్యులు చెబుతారు. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. నియాసిన్, సెలీనియం వంటి విటమిన్లు కూడా లభిస్తాయి. ప్రొటీన్, ఇతర పోషకాల వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. 

కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల్ని బలపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గ్రామీణ, సముద్రతీర ప్రాంతాల్లో నత్తలను కొన్ని రకా ల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తారు. అయితే.. నత్తలను శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

కోస్తాలో ఆహారంగా తింటారు 
కోస్తా జిల్లాల్లో అనాదిగా నత్త మాంసం ఆహారంగా వినియోగంలో ఉంది. చేపల మాదిరిగా వీటిని సేకరించి ప్రాసెస్‌ చేసి విక్రయిస్తారు. మాంసాహారులు కొనుగోలు చేసి ఆహారంగా తింటారు. నత్తల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గ్రామీణ  ప్రాంతాల ప్రజలు భావిస్తారు. - సిద్ధార్థ వర్ధన్, ఫిషరీస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)