Breaking News

బీటెక్‌ సీట్లకు పెరుగుతున్న డిమాండ్‌

Published on Wed, 08/20/2025 - 06:09

దేశవ్యాప్తంగా బీటెక్‌ సీట్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టు­గానే సీట్ల భర్తీలోనూ గణనీయ వృద్ధి కనిపిస్తోంది. కంప్యూటర్‌ సైన్స్, అనుబంధ కోర్సుల్లో పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా బీటెక్‌ సీట్లకు భారీ క్రేజ్‌ వస్తోంది. ఫలితంగా 2024–­25 విద్యా సంవత్సరంలో ఎనిమిదేళ్ల గరిష్ఠ రికార్డులను నమో­దు చేస్తూ ఏకంగా 12.53 లక్షల సీట్లు భర్తీ అవ్వడం విశేషం. – సాక్షి, అమరావతి

» అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) 2024–25లో 14.90 లక్షల బీటెక్‌ సీట్లకు అనుమతి ఇచ్చింది. ఇందులో 12.53 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. ఇది 2017–18లో సీట్ల భర్తీతో పోలిస్తే 67 శాతం పెరుగుదల. పైగా గత ఏడాది భర్తీ కాని సీట్ల సంఖ్య కనిష్ఠంగా 16.36 శాతానికి చేరడం విశేషం. ఇక్కడ కంప్యూటర్‌ సైన్స్, కోర్‌ కోర్సుల్లో విద్యార్థుల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏఐసీటీఈ 2025–26లో ఏకంగా 15.98 లక్షల సీట్లకు ఆ­మోదం ఇచ్చింది. ఇది గత ఏడాది కంటే 7 శాతం ఎక్కువ. 

» దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కంప్యూ­టర్‌ సైన్స్, అనుబంధ కోర్సులే అగ్రగామిగా నిలుస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌లో నిరుడు 3,90,245 ప్రవేశాలు నమోదయ్యాయి. తర్వాత మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (2,36,909), సివిల్‌ ఇంజినీరింగ్‌ (1,72,936), ఎల్రక్టానిక్స్‌–కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (1,60,450), ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ (1,25,902) కోర్సులు ఉన్నాయి.  

»  టెక్‌ రంగంలో పెరిగిన అవకాశాలు కంప్యూటర్‌ కోర్సులపై విద్యార్థులు దృష్టిసారించేలా చేస్తున్నాయి. ఏఐసీటీ­ఈ గతంలో సీట్లకు పరిమితంగా అనుమతులిచ్చేది. ఆ విధానాన్ని సవరిస్తూ కళాశాలల్లో మౌలిక వసతులు, నిర్దిష్ట నిబంధనలకు తగ్గట్టుగా సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులు­బాటు ఇచ్చింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా సీట్ల సంఖ్య అమాంతం పెరిగింది.  

»  2017–18 నుంచి 2021–22 మధ్య సీట్ల అనుమతులు (ఇన్‌టేక్‌)కొంత తగ్గింది. ఫలితంగా 2018–19లో ప్రవేశాలు 7.22 లక్షలకు పడిపోయాయి. కానీ, 2021–22 నుంచి కంప్యూటర్‌ సైన్స్‌పై మక్కువ పెరగడంతో సీట్లకు డిమాండ్‌ ఏర్పడి గణనీయమైన మార్పులు వస్తున్నాయి. 

»  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, స్పేస్‌ టెక్నాలజీ, గ్రీన్‌ ఎనర్జీ వంటి కోర్సులు ఇంజినీరింగ్‌ విద్యలో కెరీర్‌ అవకాశాలను పెంచడంలో కీలకంగా ఉన్నట్టు విద్యావేత్తలు భావిస్తున్నారు. 

»  బీటెక్‌ అంటే కేవలం కంప్యూటర్స్‌ సైన్స్‌ కోర్సులు మాత్రమే కాదని ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల సమూహంతో నడవాలని కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. వీటిలోని కళాశాలలు కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేయగా తిరస్కరించాయి. ఇందులో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. కొన్ని కళాశాలలు సివిల్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సీట్లను కంప్యూ­టర్‌ సైన్స్‌లోకి కన్వర్షన్‌ చేస్తుండడంపై రాష్ట్రాలు 
కఠినంగా వ్యవహరిస్తున్నాయి. 

»  ఏఐసీటీఈ ఆమోదించిన ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల సంఖ్య 2020–21 నుంచి తగ్గగా... ఈ ఏడాది తొలిసారిగా పెరిగింది. 2025–26లో 5,875 ఆమోదిత సంస్థలు ఉన్నా­యి. గత ఏడాది ఇవి 5,845 మాత్రమే. 2020–21 లో నమోదైన 6,062 కంటే తక్కువే అని చెప్పాలి. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)