Breaking News

Andhra pradesh: జనవరి 5న గ్రూప్‌–2 మెయిన్స్‌

Published on Thu, 10/31/2024 - 03:56

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీ­క్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. డీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తదితర పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌పై వివరణ తీసుకుని గ్రూప్‌–2 మెయిన్స్‌ తేదీని ఖరా­రు చేసినట్లు ఆయన తెలిపారు.

కాగా, ప్రభు­త్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 899 గ్రూప్‌–2 కేటగిరీ పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్‌లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహించగా, 4,04,039 మంది హాజరయ్యారు. ఏప్రిల్‌ 5న ఫలి­తాలు ప్రకటించారు. ఇందులో మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో 89,900 మంది అర్హత సాధించినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్‌ నిర్ణయించినప్పటికీ... నిరు­ద్యోగ అభ్య­ర్థుల విజ్ఞప్తి మేరకు ఎక్కువ మందికి మెయిన్స్‌ రాసే­­ందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు.

వాస్తవానికి జూన్‌లోనే మెయిన్స్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ చైర్మన్‌ లేకపోవడం, ఇతర కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేశారు. తాజాగా జనవరి 5న మెయిన్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆఫ్‌ లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించి పేపర్‌–1, పేపర్‌–2­లలో 150 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి.

భర్తీ చేస్తున్న పోస్టులు ఇవే...
ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌లో డిప్యూటీ తహసీల్దార్‌–114, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌–150, గ్రేడ్‌–3 మున్సిపల్‌ కమిషనర్‌–4, గ్రేడ్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌–16, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌–­28 పోస్టులతోపాటు 59 శాఖల్లో 331 ఎగ్జి­క్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. నాన్‌ ఎగ్జిక్యూ­టివ్‌ విభాగంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఏవో), సీనియర్‌ ఆడిటర్, ఆడిటర్‌ ఇన్‌ పే అండ్‌ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 566 ఉన్నాయి. నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత మరో రెండు పోస్టులను కలిపారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)