Breaking News

ఏపీలో రేపే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

Published on Sat, 03/16/2024 - 20:17

సాక్షి, విజయవాడ: ఏపీలో రేపు గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. రాష్డ్ర వ్యాప్తంగా 89 పోస్టులకి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ పరీక్ష​కు 1,48,881 మంది అభ్యర్ధుల దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లగా గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-1 ప్రిలిమనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 301 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు  పేపర్ -1 జనరల్ స్టడీస్ పరీక్ష, ఉదయం 9.45 గంటల వరకు అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతించనున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ -2  జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్షకి 18 జిల్లాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమారాలతో పర్యవేక్షించనున్నారు.

గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష పర్యవేక్షణకు 18 మంది ఐఏఎస్‌లను నియమించారు. జిల్లా కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలని అభ్యర్ధులకు ఎపీపీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమనరీ నిర్వహణకు 301 మంది లైజనింగ్ అధికార్లు, 6612 మంది ఇన్విజలేటర్లు నియమించారు. ఏపీపీఎస్సీ నుంచి 39 మందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

ఇదీ చదవండి: ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే.. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)