Breaking News

రేపటి నుంచి గ్రూప్‌–1 మెయిన్‌

Published on Fri, 05/02/2025 - 05:31

సాక్షి, అమరావతి: గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షలకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి రాజాబాబు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పరీక్షలకు ప్రశ్నా పత్రాలను ట్యాబ్స్‌ ద్వారా పంపిణీ చేయనున్నారు. జవాబు రాసేందుకు రూల్డ్‌ బుక్‌లెట్‌ కాకుండా తెల్లకాగితాల బుక్‌లెట్‌ను అందిస్తామని ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ పేపర్‌పై రాసిన సమాధానాల కింద బాల్‌పాయింట్‌ పెన్‌తో మాత్రమే అండర్‌లైన్‌ చేయాలని, స్కెచ్‌ పెన్‌తో అండర్‌లైన్‌ చేస్తే ఆయా పేపర్లను మూల్యాంకనం చేయబోరని స్పష్టం చేసింది. 

కాగా, 2023 డిసెంబర్‌లో 89 గ్రూప్‌–1 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్‌ నిర్వహించి ఏప్రిల్‌లో ఫలితాలను వెల్లడించారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున (1:50) 4,496 మంది మెయిన్‌కు ఎంపికయ్యారు. వీరికి విశాఖలో 2, విజయవాడ 6, తిరుపతి 3, అనంతపురం 2.. మొత్తం 13 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. 

పరీక్షలను 7 రోజులు 7 పేపర్లకు వరుసగా నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.45 వరకు పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురాకూడదు. పూర్తి వివరాలకు http://psc.ap.gov.in లో చూడవచ్చు.  

పరీక్షల షెడ్యూల్‌ ఇదీ..
మే 3    :    తెలుగు పేపర్‌ (అర్హత పరీక్ష)
మే 4    :    ఇంగ్లిష్‌ పేపర్‌ (అర్హత పరీక్ష)
మే 5    :    పేపర్‌–1 – జనరల్‌ ఎస్సే
మే 6    :     పేపర్‌–2 – భారత, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలు 
మే 7    :    పేపర్‌–3 – రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం, నీతిశాస్త్రం 
మే 8    :    పేపర్‌–4 – భారత, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి 
మే 9    :    పేపర్‌–5 – సైన్స్, టెక్నాలజీ అండ్‌ పర్యావరణ అంశాలు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)