భూగర్భంలో జలరాశులు అపారం

Published on Tue, 01/21/2025 - 05:28

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ 2024లో భూగర్భజలాలు అపారంగా పెరిగాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురవడంతో వర్షపు నీరు భారీగా భూమిలోకి ఇంకి భూగర్భజలంగా మారింది. దేశంలో 2024లో 12,656.20 టీఎంసీలు(446.9 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు) మేర భూగర్భజలాలు పెరిగాయని కేంద్ర భూగర్భజల మండలి(సీజీడబ్ల్యూబీ) అంచనా వేసింది. ఇందులో 11,503.30 టీఎంసీలను ఉపయోగించుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అందులో 60 శాతం జలాలను వినియోగించుకున్నారని లెక్కగట్టింది. రాష్ట్రంలో 2024లో 787.30 టీఎంసీల మేర భూగర్భజలాలు పెరిగితే.. అందులో 223.17 టీఎంసీలను ఉపయోగించుకున్నారని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 2024లో భూగర్భజలాల పరిస్థితి అధ్యయనం చేసిన సీజీడబ్ల్యూబీ ఇటీవల కేంద్ర జల్‌ శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది.  

సీజీడబ్ల్యూబీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ... 
⇒ దేశంలో తొలి సారిగా 1980లో భూగర్భజలాల పరిస్థితిపై అధ్యయనం జరిగింది. ఆ తర్వాత 1995, 2004, 2009, 2011, 2013, 2017, 2020లలో భూగర్భజలాల పరిస్థితిపై సీజీ­డబ్ల్యూబీ అధ్యయనం చేసింది. 2022 నుంచి ఏటా భూగర్భజలాల పరిస్థితిపై అంచనా వేస్తోంది. 
⇒ దేశంలో కురిసే వర్షం వల్ల వచ్చే నీటిలో 61 శాతం భూమిలోకి ఇంకి, భూగర్భజలాలుగా మారుతున్నాయి. 

⇒ 2023తో పోల్చితే 2024లో భూగర్భజలాల పరిమాణం కాస్త తగ్గింది. 2023లో భూగర్భజలాల పరిమాణం 12,717.95 టీఎంసీలు  ఉంటే... అది 2024లో 12,656.20 టీఎంసీలకు తగ్గింది. ఇక భూగర్భజలాల వినియోగం 2023తో పోల్చితే 2024లో పెరిగింది. భూగర్భం నుంచి 2023లో 6,834.75 టీఎంసీలను... 2024లో 6,956.52 టీఎంసీలను వినియోగించుకున్నారు. 
⇒ దేశంలో భూగర్భజలాలను పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, డయ్యూ డామన్, గుజరాత్‌లలో భారీ ఎత్తున తోడేసి ఉపయోగించుకుంటున్నారు. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)