ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Published on Fri, 05/16/2025 - 05:02

సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నేటి (శుక్ర­వా­రం) నుంచి జూన్‌ 2 వరకు ఇందుకు అవకాశం కల్పిస్తూ, ప్రస్తుతమున్న నిషేధాన్ని సడలిస్తూ ఆర్థిక­­శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్‌ గురువా­రం ఉత్తర్వులు జారీచేశారు. మే 31 నాటికి ఒక స్టేషన్‌లో ఐదేళ్లు నిరంతరాయంగా పనిచేస్తున్న ఉద్యో­గులను తప్పనిసరిగా బదిలీ చేయాలి. వీరేకాక.. 

» వ్యక్తిగతంగా అభ్యర్థన చేసుకునే వారు కూడా ఈ బదిలీలకు అర్హులు. 
»    మే 31, 2026 లేదా అంతకుముందు పదవీ విరమణచేసే ఉద్యోగులను పరిపాలన కార­ణా­లు లేదా వారి అభ్యర్థన అయితే తప్ప బదిలీ చేయరు. 
»   దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలున్న వారు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న కేంద్రానికి బదిలీ కోరుకుంటే ప్రాధాన్య™­నివ్వాలి. 
» ఇక గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు, నిబంధనల ప్రకారం ధృవీకరించబడిన 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు, క్యాన్సర్, ఓపెన్‌ హార్ట్‌ ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వైద్య కారణాలపై (స్వీయ లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లలకు సంబంధించిన) బదిలీ కోరుకునే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
»   కారుణ్య కారణాలపై నియమితులైన వితంతువుల బదిలీలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. 
»   దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు బదిలీల నుండి మినహాయింపు పొందుతారు. వారు అభ్యర్థించినప్పుడు ఖాళీ లభ్యతకు లోబడి వారు ఎంచుకున్న ప్రదేశానికి బదిలీ చెయ్యొచ్చు. 
»  భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వోద్యోగులైతే, వారిద్దరినీ ఒకే స్టేషన్‌లో లేదా దగ్గరగా ఉన్న స్టేషన్లలో బదిలీ చేయడానికి ప్రయత్నించాలి.

నోటిఫైడ్‌ ఏజెన్సీల్లో ఇలా..
ఇక నోటిఫైడ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను వారు కోరు­కున్న స్టేషన్లకు బదిలీ చేయాలి. 50 ఏళ్ల కన్నా తక్కువ వయస్సుగల ఉద్యోగులను ఏజెన్సీ ప్రా­ంతాలకు బదిలీ చేయాలి. ఇప్పటి­వరకు ఐ­టీడీఏ ప్రాంతాల్లో పనిచేయని ఉద్యోగుల సర్వీ­సు కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఏజె­న్సీ ప్రాంతాలకు బదిలీ చేయాలి. జూన్‌ 3 నుంచి బదిలీలపై తిరిగి నిషేధం అమల్లోకి వస్తుంది. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)