Breaking News

ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం

Published on Sun, 07/30/2023 - 04:31

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కులాలు, మతాలకతీతంగా నిర్వహించుకునే నెల్లూరు రొట్టెల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు... కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్‌ దర్గా ప్రాంగణం తొలి రోజు కిటకిటలాడింది. వరాల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు.

ఐదు రోజులపాటు నిర్వహించనున్న రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్, జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్, కార్పొరేషన్‌ కమిషనర్‌ వికాస్‌ మర్మత్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ విద్యాధరి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, వివిధ ప్రైవేటు హాస్పిటల్స్‌ వారు స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 

నిఘా నీడలో...  
రొట్టెల పండుగ సందర్భంగా దర్గా ఆవరణతోపాటు స్వర్ణా­ల చెరువు, పార్కింగ్‌ ప్రదేశాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తప్పి­­పోయిన చిన్నారులు, వృద్ధుల సమాచారాన్ని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ విభాగం ద్వారా తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగిస్తున్నారు. స్వర్ణాల చెరువు తీరం వెంబడి చిన్నారులు లోతుగా వెళ్లకుండా పటి­ష్టమైన నిఘా పెట్టారు. ముఖ్యంగా మహిళా భక్తులకు ఎ­లాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)