Breaking News

కేసులు పెట్టండి.. లోపలెయ్యండి!

Published on Sun, 07/13/2025 - 06:05

సాక్షి  టాస్క్ ఫోర్స్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సూపర్‌ సక్సెస్‌ కావడాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఆ కార్యక్రమానికి తండోపతండాలుగా తరలి వచ్చిన రైతులు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే కుట్రలకు పదును పెట్టింది. ఈ నెల 9వ తేదీన వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటనకు రైతు­లు, అభిమానులు రాకుండా కూటమి పెద్దలు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని పోలీసులందరినీ రంగంలోకి దింపి అడుగడుగునా అడ్డుకున్న విషయం తెలిసిందే. 

ఎంతో మంది నేతలకు నోటీసులు ఇవ్వడంతో పాటు పలువురిని బైండోవర్‌ చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులు, అభిమానులను చూసి కూటమి ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌పై దాడి అంటూ బూచిగా చూపి కొందరిపై, రోడ్లపై మామిడి కాయలు పారబోశారంటూ మరికొందరిపై కేసులు నమోదు చేయించారు. 

ఇది చాలదన్నట్లు పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సునీల్‌కుమార్, గంగాధర నెల్లూరు, చిత్తూరుకు చెందిన వినోద్, మోహన్, చక్రిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని జైల్లో పెట్టేందుకు బలమైన సాక్ష్యాలను సృష్టించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

కక్షగట్టి కేసుల నమోదు
ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌పై దాడి చేశారనే నెపంతో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదు­పు­లోకి తీసుకుని మరి కొందరి పేర్లు చెప్పించేందుకు వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోగ్రాఫర్‌కు వంద మీటర్ల దూర­ంలో ఉన్న నేతలను సైతం గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మార్కెట్‌ యా­ర్డు­లోకి చొరబడ్డారని, మామిడి కాయలను తొక్కారని మరికొందరిపై కేసులు పెట్టేందుకు వ్యవసాయ, సంబంధిత శాఖ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలిసింది. 

మామిడి కాయ­లు కింద పారబోసిన ఘటనలో సంబంధమే లేని ర్యాంపు యజమానిపై కేసు నమోదు చేసే­ందుకు యతి్నస్తున్నట్లు సమాచారం. మొన్న­టి వరకు వైఎస్సార్‌సీపీ నేతలే వారి తోటలోని కాయలు తీసుకొచ్చి కావాలనే రోడ్డుపై పారబోశారని కేసులు నమోదు చేశారు. తాజాగా సమీపంలోని ర్యాంపు యజమానే మామిడి కాయ­లు పంపించారని, అతనిపైనా కేసు నమోదు చేసేందుకు సాక్ష్యం కోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొన్న వారిపై దండుపాళ్యం బ్యాచ్‌ అంటూ ఎల్లో మీడియా దు్రష్పచారం చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆగ్రహం వ్యక్తం చేసిన వారిపై ఎల్లో గ్యాంగ్‌ ఫోన్లు చేసి తీవ్రంగా బెదిరిస్తోంది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)