Breaking News

ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు షాక్‌

Published on Fri, 08/30/2024 - 04:10

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగు­లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. నైట్‌ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను జీతాల బిల్లులతో కలిపి ఇవ్వకూడదని నిర్ణయించింది. దాంతో రాష్ట్రంలోని దాదాపు 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రయో­జనాలు దెబ్బతిననున్నాయి. తమకు జీతాలతో­పాటే నైట్‌ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర అలవెన్స్‌లు చెల్లించా­లని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నిధుల కొరత లేదా ఇతర కారణాలతో అలవెన్స్‌లు ఏళ్ల తరబడి చెల్లించేవారు కాదు. 

ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఆర్టీసీని ప్రభు­త్వ­ంలో విలీనం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ అంశంపై కూడా సాను­కూలంగా స్పందించింది. అల­వె­న్స్‌లను కూడా గ్రేడ్‌–1 ఉద్యోగులకు రూ.600 నుంచి రూ.800కు, గ్రేడ్‌–2 ఉద్యోగులకు రూ.400 నుంచి రూ.600కు, గ్రేడ్‌–3 ఉద్యోగులకు రూ.300 నుంచి రూ.400కు పెంచింది. ఆ అలవెన్స్‌­లను జీతాల బిల్లులతో­పా­టే ఆమోదించి ప్రతి నెలా జీతాల­తోపాటే చెల్లించాలని నిర్ణ­యించింది. దాంతో ఈ ఏడాది ఫిబ్ర­వరి నుంచి డ్రైవర్లు, కండక్టర్లకు జీతాల­తో­­పాటు అలవెన్స్‌లను కూడా చెల్లిస్తూ వచ్చారు. 

కాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది. ఆగస్టు నెల జీతాల బిల్లులతో నైట్‌డ్యూటీ అల­వె­న్స్‌­లు, టీఏలు, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌­లను కలపవద్దని విజయ­వాడ­లోని ఆర్టీసీ ప్రధాన కార్యా­ల­యం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు షాక్‌కు గురయ్యారు. గతంలో టీడీపీ ప్రభు­త్వంలో తమకు అల­వెన్స్‌లు ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉండే విష­యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తు­తం అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఆందోళన చెందుతు­న్నారు. 

నేడు నిరసన
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని డిపోల్లో ఉద్యోగులు ఈ నెల 30న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించాం. నిరసన ప్రద­ర్శన నిర్వహిస్తాం. రిటై­రైన ఉద్యోగులకు సకాలంలో సెటి­ల్‌మెంట్‌ చేయకుండా ట్రెజరీ శాఖ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఈ అంశంపై కూడా నిరసన తెలుపుతాం.  – పీవీ రమణారెడ్డి, అధ్యక్షుడు, – వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)