AP: పాఠశాల ఉంది.. పాఠం వినేవారు లేరు..!

Published on Sun, 06/29/2025 - 15:40

పెనుమంట్ర:  పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్‌) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్‌ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. 

వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్‌ టీచర్‌ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు.

వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం గవర్నమెంట్‌ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తూ ఉండటంతో దీనిపై ప్రభుత్వం ఎంత వరకూ శ్రద్ధ చూపిస్తుందనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.

వెలగలవారిపాలెంలో దళితవాడలో నాడు-నేడులో నిర్మించిన భవనం

వెలగలవారిపాలెంలో దళితవాడలో నాడు-నేడులో నిర్మించిన భవనం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)