Breaking News

బీచ్‌ శాండ్‌పై కూటమి కన్ను

Published on Tue, 09/09/2025 - 05:37

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నదీ ఇసుక, నీటి వనరులను దోచుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు సాగర తీరంపై దృష్టి సారించింది. బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ పేరుతో భీమిలి తీరంలో భారీగా ఖనిజాల అక్రమ రవాణాకు పాల్పడేందుకు కుట్ర పన్నుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలోని భీమిలి ప్రాంతంలో 90.15 హెక్టార్ల సముద్ర తీరాన్ని ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వా­లని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని ద్వారా విలువైన ఖనిజాలు దోపిడీకి గురవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభు­త్వం తమ జేబు­లు నింపుకోవడానికి ఇలాంటి విధ్వంసకర కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మైనింగ్‌ కార్యకలాపాలకు టెండర్లు ఆహ్వానిస్తోంది. 

మద్రాస్‌లో మైనింగ్‌ పేరుతో విధ్వంసం 
గతంలో మద్రాసులో బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ పేరుతో ప్రైవేటు సంస్థలు సముద్ర తీరాన్ని ధ్వంసం చేసి, దేశ భద్రతకు అవసరమైన ఖనిజాలను అక్రమంగా తరలించాయ. ఆ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు, మద్రాసు హైకోర్టు తక్షణమే మైనింగ్‌ను నిలిపివేయాలని ఆదేశించి, ప్రభుత్వాలకు పర్యావరణ పరిరక్షణపై హెచ్చరికలు జారీ చేసింది. ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ఏపీ ప్రభుత్వం తమ స్వలాభం కోసం పర్యావరణాన్ని పణంగా పెడుతోంది. 

మోనజైట్‌ పేరుతో దోపిడీకి కుట్ర 
ఈ ఖనిజాల్లో అణుధార్మిక శక్తి కలిగిన మోనజైట్‌ ముఖ్యమైనది. దీనిని అణు విద్యుత్‌ అభివృద్ధికి ఇంధన వనరుగా వినియోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన చట్ట సవరణల మేరకు, అణుధార్మికత పరిమితంగా ఉన్న ఖనిజాలను విక్రయించుకోవచ్చని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకొని మోనజైట్‌ పేరుతో భారలోహాలను పెద్ద ఎత్తున అక్రమంగా తరలించేందుకు కుట్ర జరుగుతోందని, దీనికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మైనింగ్‌ వల్ల పర్యావరణానికి, దేశ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

భీమిలి..ఖనిజాల నిక్షేపం 
రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో భీమిలిలోనే అరుదైన, అత్యంత విలువైన ఖనిజాలు ఉన్నాయని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వేలు వెల్లడించాయి. భీమునిపట్నం, పూడిమడక ప్రాంతాల్లో గార్నెట్, జిర్కోనియం, ఇలిమినెట్, సిలిమినైట్, రూటిల్, లికాక్సిన్, మోనజైట్‌ వంటి భారలోహాలు ఉన్నట్లు జీఎస్‌ఐ గుర్తించింది. భీమిలిలోని నిక్షేపాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ ఖనిజాలను ఏరోస్పేస్, వైద్య పరికరాలు, అణు రియాక్టర్ల వంటి వ్యూహాత్మక రంగాలలో ఉపయోగిస్తారు.

ప్రైవేట్‌కు బీచ్‌ మైనింగ్‌ కట్టబెట్టడం దారుణం
శ్రీకాకుళం, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ కోసం ప్రైవేట్‌ సంస్థలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరం. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి. తమిళనాడులో బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ పేరుతో ప్రైవేట్‌ సంస్థలు మోనజైట్‌ వంటి విలువైన ఖనిజాలను అక్రమంగా తరలించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

అణు అభివృద్ధిలో మూడో దశకు ఇంధన వనరుగా ఉపయోగపడే అత్యంత కీలకమైన మోనజైట్‌ను కోల్పోవడం దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తుంది. అటమిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ (డీఏఈ) ఇప్పటికే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వానికి బీచ్‌ శాండ్‌ మైనింగ్‌కు అనుమతులు ఇవ్వవద్దని లేఖ కూడా రాసింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించాలి.  – ఈఏఎస్‌ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)