భూమి పాయే.. బతుకూ పోయే..

Published on Fri, 01/31/2025 - 03:58

భూమితో రైతుకు విడదీయలేని బంధం. మట్టిని పెకళించి.. స్వేదం చిందించి.. సేద్యం చేసే రైతు తన భూమిని కన్నతల్లి కంటే మిన్నగా భావిస్తాడు. అటువంటి భూమిని నమ్ముకుని బతికే అన్నదాతలు తమ బిడ్డల భవిష్యత్‌ను కాంక్షించి పారిశ్రామిక అవసరాల కోసం అమ్ముకున్నారు. ఆ రోజు ప్రభుత్వం పదో పరకో ఇచ్చి కొనుగోలు చేసిన భూములను కార్పొరేట్‌ సంస్థకు అప్పగించింది. 

భూమిపోయినా.. బతుకుపోయినా.. భవిష్యత్‌ ఉంటుందని భావించిన రైతుల ఆశలు పదిహేడేళ్లుగా పగటి కలగా మిగిలిపోయాయి. రూ.కోట్లు పలుకుతున్న తమ భూములు కళ్ల ముందు నిర్జీవంగా పడి ఉండడం చూసి అన్నదాతలు కుమిలిపోతున్నారు.  

ముత్తుకూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి(YS Raja sekhara Reddy) పారిశ్రామికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. వైఎస్సార్‌ సీఎం కాక ముందు వరకు చీకటి ఆంధ్రప్రదేశ్‌గా ఉండేది. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, విద్యుత్‌ కోతలు, కొరత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్‌ రంగంలో విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు(Power projects) ఏర్పాటు చేయాలని యోచన చేశారు. అందులో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులో ప్రభుత్వ రంగ జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్ట్‌లకు వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. 

ఈ క్రమంలో కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ లిమిటెడ్‌ పేరుతో రిలయన్స్‌ సంస్థ(Reliance Industries) రిలయన్స్‌ పవర్స్‌ యాజమాన్యం కృష్ణపట్నంలో 3,960 మెగావాట్ల రిలయన్స్‌ అ్రల్టామెగా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం 2007లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది.  

ఎకరాకు రూ.7.70 లక్షల పరిహారం  
రిలయన్స్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ కోసం రైతుల నుంచి మాగాణి, మెట్ట భూములే కాకుండా దేవాలయాలు, సీజేఎఫ్‌ఎస్‌ భూములు మొత్తం 2,668 ఎకరాలు సేకరించారు. అయితే అప్పట్లో పట్టా భూములు ఎకరాకు రూ.7.70 లక్షల పరిహారంగా ఇచ్చారు. భూమి సేకరించినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పదో పరకో అప్పుడే ఖర్చయిపోయాయి. అదే భూములు కొద్ది రోజులకే రూ.కోట్లు పలికాయి. ఈ ప్రాజెక్ట్‌ కోసం అయ్యవారప్పకండ్రిగ, శంభునితోపు గ్రామాలను సైతం ఖాళీ చేయించి, ముత్తుకూరు సమీపంలో పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. 

ముక్కారు పంటలు పండే భూములను రైతులు పారిశ్రామికాభివృద్ధి కోసం త్యాగం చేశారు. ఆ భూమి మీదనే బతికే రైతులు భూములు పోయినా.. తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి.. బంగారు భవిష్యత్‌ ఉంటుందని భావించారు. కానీ భూములు పోయి.. బతుకు పోయి.. భవిష్యత్‌ కానరాక రైతు కుటుంబాలు కూలీలుగా మారారు. 

అర్ధాంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్ట్‌  
రూ.20,000 కోట్ల అంచనాలతో ప్రాజెక్ట్‌ పనులు 2008లో ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు చుట్టూ ఎత్తైన గోడ నిర్మాణం పూర్తి చేశారు. ప్రత్యేక రోడ్లు నిర్మించారు. పెద్ద పెద్ద అడ్మిని్రస్టేషన్‌ భవనాలు నిర్మించారు. పెద్ద ఎత్తున యంత్రాలు, పరికరాలను దిగుమతి చేసుకొన్నారు. 

యజమాని అనిల్‌ అంబానీ పర్యటన కోసం హెలిప్యాడ్‌ కూడా ఏర్పాటు చేశారు. అ్రల్టామెగా పవ­ర్‌ ప్రాజెక్ట్‌ నిబం­ధనల ప్రకారం విద్యు­త్‌ ఉత్పత్తి­లో ఆంధ్ర (ఉ­మ్మడి తెలు­గు రా­ష్ట్రాలు)కు 40 శా­తం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు 20 శాతం చొప్పున విద్యుత్‌ పంపిణీ జరగాలని ఒప్పందాలు కుదిరాయి.   

భూములు తిరిగి రైతులకు ఇచ్చేయాలి  
పశి్చమబెంగాల్‌ సింగూరులో ప్రాజెక్ట్‌ కోసం సేకరించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం గతంలో తిరిగి రైతుల పరం చేసింది. ఆ తరహాలోనే రిలయన్స్‌ ప్రాజెక్ట్‌ కోసం సేకరించిన భూముల్ని కూడా రైతులకు స్వాదీనం చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే హోదాలో గతంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి పలుమార్లు డిమాండ్‌ చేశారు. 

స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. చట్ట ప్రకారం రైతుల భూముల్లో ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయకుంటే వాటిని తిరిగి రైతుల పరం చేయాలని ఆందోళన చేశారు. కానీ దాదాపు 17 ఏళ్లు గడుస్తున్నా.. ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చలేదు. తిరిగి భూములు రైతుల పరం కాలేదు. 

ఈ నేపథ్యంలో ఇటీవల రిలయన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ కృష్ణపట్నంలోని భూములను స్వయంగా పరిశీలించారు. దీంతో స్థానికంగా ఆశలు చిగురిస్తున్నాయి. ఈ భూముల్లో కొత్త పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అనూహ్యంగా రైతు బతుకు తలకిందులు 
పనులు వేగంగా జరుగుతున్న దశలో ఎంఓయూలో చేసుకున్న ఒప్పందాలకు–వాస్తవ పరిస్థితులకు మధ్య తలెత్తిన తేడా వల్ల 2011లో అనూహ్యంగా ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో భూములిచ్చిన కృష్ణపట్నం పంచాయతీ రైతులు హతాశులయ్యారు. 

భూముల పరిహారంగా పుచ్చుకున్న డబ్బు కరిగిపోయింది. ప్రాజెక్టు ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందవచ్చని భావించిన రైతులు, యువకుల ఆశలు అడియాశలయ్యాయి. సన్న, చిన్నకారు రైతులు కూలీలుగా మారారు. పునరావాస కాలనీల్లో అభివృద్ధి పడకేసింది.

కృష్ణపట్నం పంచాయతీ అభివృద్ధి జరగాలి  
ప్రాజెక్ట్‌ల కోసం భూములు సేకరించి, కృష్ణపట్నం చుట్టూ ప్రహరీ నిర్మించారు. ప్రాజెక్ట్‌లు రాకపోవడం వల్ల అటు రైతులకు వ్యవసాయం, ఇటు యువతకు ఉద్యోగాలు కరువయ్యాయి. పేదలు ఉపాధికి దూరమయ్యారు. రిలయన్స్‌ కోసం సేకరించిన భూముల్లో కొత్త ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగాలు, పేదలకు ఉపాధి కల్పించాలి.  – కారంచేటి ప్రసాదశర్మ, ఎంపీటీసీ సభ్యుడు, కృష్ణపట్నం 

యువకులకు ఉద్యోగ కల్పన జరగాలి 
రిలయన్స్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌కు అనిల్‌ అంబానీ ఇటీవల వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం సేకరించిన భూముల్లో కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు కావాలి. చదువుకున్న యువకులకు ఉద్యోగాల కల్పన జరగాలి. గ్రామం అన్ని విధాలా అభివృద్ధి జరగాలి. ప్రాజెక్ట్‌లు ఏర్పాటు కాకుంటే రైతులకు తిరిగి భూములు స్వాధీనం చేయాలి.  – రాగాల వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్, కృష్ణపట్నం  

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)