ఉప్పు రైతుకు ధరల తీపి

Published on Fri, 05/31/2024 - 05:39

సింగరాయకొండ: వాతావరణం అనుకూలించడం, ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఉప్పు రైతుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తమిళనాడులోని ఉప్పు పండించే ట్యుటికోరన్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఉప్పు తయారీ నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పండించే ఉప్పు­కు గిరాకీ ఏర్పడింది. 

ఆ ఏడాది ఫిబ్రవరిలో ఉప్పు తయారీ ప్రారంభం కాగా.. నిన్న మొన్నటివరకు 75 కేజీల బస్తా ఉప్పు ధర రూ.100 నుంచి రూ.­150 పలికింది. తమిళనాడు నుంచి భారీఎత్తున వ్యాపారులు ఇక్కడికి వచ్చి ఉప్పు కొనుగోలు చేస్తుండటంతో బస్తా రూ.200 ధర పలుకుతోంది.   

9 నెలలూ ఉప్పు సాగే 
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల పరిధిలోని సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు. వర్షాకాలం తప్ప మిగిలిన కాలాల్లో సుమారు 9 నెలలపాటు ఉప్పు సాగు చేస్తారు. ఎకరాకు 800 నుంచి 900 బస్తాల వరకు ఉప్పు దిగుబడి వస్తోంది.

ఈ ఏడాది వాతావరణం బాగా అనుకూలించడంతో 1,300 నుంచి 1,400 బస్తాల వరకు దిగబడి వస్తోంది. ప్రతినెలా ఇక్కడ 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. తయారీ బాగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 7 వేల మంది వరకు రైతులు, 10 వేలకు పైగా కూలీలు లబ్ధి పొందుతున్నారు.  

ధరలు బాగున్నాయి 
10 ఎకరాలను కౌలుకు తీసుకుని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ధరలు పెరుగుతుండటంతో ఉప్పు నిల్వ చేశాను. తమిళనాడు వ్యాపారులు నేరుగా వచ్చి నన్ను కలవటంతో మంచి ధర లభించింది. – పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం

దిగుబడి బాగా వచ్చింది 
ఐదెకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నాను. ఏడాది ప్రారంభంలో ధరలు తక్కువగా ఉన్నా దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు వ్యాపారుల రాకతో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా ఉప్పు కొనుగోలు చేస్తే రైతుకు మంచి ధరలు లభిస్తాయి.  – గౌరవరపు శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)