Breaking News

AP: ‘కారుణ్య’ ఉద్యోగులకు శుభవార్త 

Published on Wed, 07/26/2023 - 08:28

సాక్షి, అమరావతి: కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కారుణ్య నియామకం కింద టైపిస్ట్, ఎల్‌డీ టైపిస్ట్, యూడీ టైపిస్ట్, టైపిస్ట్‌ కమ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు పొందినవారు కంప్యూటర్‌ పరీక్ష పాసైతే వారి సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇందుకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారు ఇక నుంచి తెలుగు, ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనకు స్వస్తి చెబుతూ సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్‌) కార్యదర్శి పోలా భాస్కర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఉద్యోగులు రెండేళ్లలోపు కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు స్పష్టంచేశారు. ఈ మేరకు గత నిబంధనలను సడలించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు.  

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు 
ఎంతోకాలంగా ఇబ్బందిపడుతున్న కారుణ్య నియామక ఉద్యోగుల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం కారుణ్య నియామకం కింద టైపిస్ట్, స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగాలు పొందినవారు తెలుగు, ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ టెస్ట్‌ పాస్‌ అయితేనే వారి సర్వీసు రెగ్యులర్‌ చేసేవారని, టైపింగ్‌కు ప్రాధాన్యత తగ్గిపోవడంతో అది నేర్పించేవారు లేక, ఆ పరీక్ష పాస్‌ కాలేక చాలామంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి రెగ్యులర్‌ కాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాము సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కారుణ్య నియామకం ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు తెలుగు, ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ పరీక్షల నుంచి మినహాయింపు 
ఇచి్చందని వివరించారు.     

ఇది కూడా చదవండి: ‘అప్పటికీ సునీతమ్మ ఫోన్‌ చేయలేదు.. ఇప్పుడు బతికున్నోళ్లను బజారుకీడుస్తోంది’

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)