అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
గుడ్ఫ్రైడే.. సీఎం వైఎస్ జగన్ ట్వీట్ సందేశం
Published on Fri, 03/29/2024 - 10:45
సాక్షి, కర్నూలు: గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. మానవాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. ఇతరులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, సహనం, త్యాగం… ఇవన్నీ తన జీవితం ద్వారా ఆయన మానవాళికి ఇచ్చిన సందేశాలు అని పేర్కొన్నారాయన.
అంతకు ముందు ఒక ప్రకటనలో.. ‘మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే.. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘‘ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు’’ అని సీఎం పేర్కొన్నారు.
మానవాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. ఇతరులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, సహనం, త్యాగం… ఇవన్నీ తన జీవితం ద్వారా ఆయన మానవాళికి ఇచ్చిన సందేశాలు. #GoodFriday
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024
మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు’’ అని సీఎం జగన్ అన్నారు.
Tags : 1