Breaking News

ఏపీకీ ఓ కేజీఎఫ్‌!

Published on Tue, 06/23/2026 - 05:15

సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగడిరాయి, ఎర్రగుడి, బొల్లవానిపల్లి సమీప ప్రాంతాల్లో బంగారు, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతంలో వజ్రాలవేట మొదలవుతుంది. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలోని సుదూర ప్రాంతాల నుంచి వజ్రాన్వేషణకు వచ్చి నెలల తరబడి ఇక్కడే తిష్టవేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక్కడ వజ్రాలతో పాటు బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జీఎస్‌ఐ­(జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) సర్వే చేసి నిర్ధారించింది. అయితే పెట్టుబ­డుల కోసం ఏ కంపెనీ ముందుకు రాలేదు.

బంగా­రం వెలికితీత వ్యయం, ఉత్పత్తికి అయ్యే ఖర్చు అ­ప్ప­ట్లో బంగారు ధరలు, డిమాండ్‌ను లెక్కిస్తే గిట్టు­బాటు కాదని కంపెనీలు వెనుకడుగు వేశాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం 2005లో మైనింగ్‌ సె­క్టార్‌­లో విదేశీపెట్టు­బడులు ఆహ్వానించింది. దీంతో ఆస్ట్రేలియాకు చెందిన ‘మెస్సర్స్‌ జియో మైసూర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెని దర­ఖాస్తు చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మైనింగ్‌ చేస్తుంటుంది. ఈ దరఖాస్తును అప్పటి ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పరిశీలించి కంపెనీ స్థితి­గతులను తెలుసుకుని అనుమతులు ఇచ్చేలోపే ఆ­య­న ప్రమాదవశాత్తు మృతి చెందారు.ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితు­ల­నేపథ్యంలో దీని అనుమతులకు ఆటంకం ఏర్ప­డింది. ఎట్టకేలకు 2013లో అనుమతులు వచ్చాయి.

597.82 హెక్టార్లలో బంగారు తవ్వకాలు
తుగ్గలి, మద్దికెర మండలాల్లో 597.82 హెక్టార్ల (1495 ఎకరాలు)లను జియో మైసూర్‌ లీజుకు తీ­సుకుంది. 2013లో నిక్షేపాల వెలికితీతకు ప్రభు­త్వా­­నికి దరఖాస్తు చేసి అనుమతులు తీసుకుంది. లీజు భూములు కాకుండా ఎకరా రూ.12 లక్షల చొప్పున 70 ఎకరాల కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించు­కుంది. 2021లో ప్రొడక్షన్‌ ప్రాసెస్‌ యూనిట్‌ ఏ­ర్పా­టు చేసింది. 1495 ఎకరాల్లో ప్రతీ 20 మీ­టర్లకు ఒక డ్రిల్లింగ్‌ చొప్పున మొత్తం 30వేల మీట­ర్లు డ్రిల్లింగ్‌ చేశారు.

2023 ఫిబ్రవరి నుండి పైల­ట్‌ ప్రాజెక్టుగా బంగారం వెలికి­తీ­తను మొ­ద­లు­పె­ట్టా­రు. ఆస్ట్రేలి­యా, దక్షిణాఫ్రికా నిపుణులు కూడా పై­ల­ట్‌ ప్రాజె­క్టులో పనులు చేశారు. ఈ ప్లాంటులో ఉ­త్పత్తి అయి­న బంగారాన్ని బెంగళూరులోని ల్యాబ్‌­కు పంపితే మంచి ఫలితాలొచ్చాయి. దీంతో పూర్తి­స్థాయి ఉత్ప­త్తి లక్ష్యంగా పనులు పూర్తి చేసింది. దక్షిణా­ఫ్రికా, చైనా నుంచి మిషనరీ తెప్పించారు. క్రషర్లు, గ్రౌండింగ్‌ యూనిట్లు దేశీయంగా కొనుగోలు చేశారు.

మైనింగ్‌ వ్యాపారి ప్రభాకరన్‌ చేతికి గోల్డ్‌మైన్‌!
కర్నూలు గోల్డ్‌మైన్‌ను తొలుత ఆస్ట్రేలియా కంపెనీ జియోమైసూర్‌ రూ.320కోట్ల పెట్టుబడితో నిర్మించింది. ఇందులో 70 శాతం వాటాను ఇండియాకు చెందిన మైనింగ్‌ వ్యాపారి ఎం. ప్రభాకరన్‌కు చెందిన త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ కొనుగోలు చేసింది. అలాగే జియో మైసూర్‌లో 27.27 శాతం వాటా డెక్కన్‌ గోల్డ్‌మైన్స్‌కు ఉంది. దీంతో గోల్డ్‌మైన్‌కు బీజం ఆస్ట్రేలియా కంపెనీ వేసినా, ఉత్పత్తి మాత్రం ఇండియా కంపెనీలే చేస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి 4.6% పన్నులు
బంగారం ఉత్పత్తి చేసే కంపెని మొదట రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, డీఎంఎఫ్‌(డిస్ట్రిక్‌ మినర్‌ ఫండ్‌) కలిపి ఉత్పత్తిలో 4.6శాతం చెల్లించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌ఎంఈటీ( నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లనేషన్‌ ట్రస్టు)కు 0.5శాతం చెల్లించాలి. డోరేబార్‌ నుంచి బంగారం బులియన్‌గా మారిన తర్వాత 25–30శాతం కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్‌లు చెల్లించాలి. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి.

స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలి ‘గోల్డ్‌మైన్‌’
మన దేశంలో 1880లో కోలార్‌ గోల్డ్‌మైన్‌ను ప్రారంభించారు. ఆపై బ్రిటీష్‌ హయాంలోనే 1945లో రాయచూర్‌లోని ‘హట్టిమైన్స్‌’ను మొదలెట్టారు. అయితే స్వాతంత్య్రం తర్వాత ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా గోల్డ్‌మైనింగ్‌ చేపట్టలేదు. ఇప్పుడు ‘త్రివేణి గోల్డ్‌మైన్‌’ తొలి గోల్డ్‌మైన్‌గా చెప్పాలి. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో ప్రత్యక్షంగా 300మందికి, పరోక్షంగా మరో 1000మంది దాకా ఉద్యోగాలు లభిస్తాయి. అనంతపురం జిల్లాలోని  రామగిరిలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందుకు రాలేదు. ఈ ప్రాంతంలో కూడా బంగారు నిక్షేపాలు వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతం అవుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)