Breaking News

గిరిజన విద్యార్థినులకు తప్పిన ప్రాణాపాయం

Published on Sun, 09/01/2024 - 05:17

సాక్షి,పాడేరు: కలుషిత ఆహారం తిని ఆస్వస్థతకు గురైన అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు ప్రాణాపాయం తప్పింది. అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రితో పాటు కిల్లోగుడ పీహెచ్‌సీ వైద్యబృందం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు వైద్యసేవలు అందించారు.  ప్రస్తుతం 61మంది విద్యార్థినులు అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు.  26మంది విద్యార్థినులు కోలుకోవడంతో డిశ్చార్జ్‌ చేశారు. 

 గుడ్డుకూర, రసంతో కూడిన అన్నం తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు 79మంది తీవ్ర అçస్వస్థతకు గురైన  ఘటనపై శనివారం ఉదయం కలెక్టర్‌ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్‌ విచారించారు. ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణ సక్రమంగా లేదంటూ గిరిజన సంక్షేమ డీడీ కొండలరావు పనితీరుపై కలెక్టర్‌ మండిపడ్డారు. జామగుడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు  ఆస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడంతో మిగిలిన విద్యార్థినులను వారి తల్లిదండ్రులు  శనివారం ఇళ్లకు తీసుకెళుతున్నారు.

బాధ్యులపై చర్యలు  తీసుకోవాలి: అరకు ఎంపీ 
అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం జాముగుడ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమపాఠశాలలో శుక్రవారం జరిగిన ఫుడ్‌పాయిజన్‌ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని  అరకు ఎంపీ డాక్టర్‌ తనూజరాణి డిమాండ్‌ చేశారు.  

స్థానిక  ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ఆమె శనివారం పరామర్శించారు.  ఆమె డాక్టర్‌ కావడంతో స్టెతస్కోప్‌తో విద్యార్థినులను పరీక్షించారు. ఆస్పత్రిలో అన్ని వార్డులను సందర్శించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడి  ధైర్యం చెప్పారు.

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)