Breaking News

వసతి గృహంలో కలకలం

Published on Mon, 12/09/2024 - 05:17

ఏలూరు టౌన్‌:  ఏలూరు నగరంలోని ఒక మిషనరీ సంస్థకు చెందిన ఆధ్యాత్మిక శిక్షణ, వసతి గృహంలో  ఆదివారం అమానుష ఘటన చోటుచేసుకుంది. ఈ భవనం నుంచి అప్పుడే పుట్టిన ఒక నవజాత శిశు­వును బయటకు విసిరేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనను సమీపంలోని ఓ అపార్ట్‌­మెంట్‌లో ఉంటున్న ఓ మహిళ, పొరు­గునున్న ఓ వాచ్‌మేన్‌ గమనించారు. దీంతో ఈ ఘటన దావానలంలా వ్యాపించింది. 

స్థాని­కులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఏలూరు అశోక్‌నగర్‌లోని మిషనరీ ఆధ్యాత్మిక శిక్షణా వసతి­గృహంలో అనేక ప్రాంతాలకు చెందిన బాలికలు, యువతులు సిస్టర్స్‌(నన్స్‌)గా శిక్షణ పొందుతుంటారు. ప్రసవించిన  బాలిక కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాలికగా నిర్వాహకులు చెబు­తున్నారు. ఈ బాలిక నగరంలోని ఓ మిషనరీ కళా­శాలలో ఇంటర్‌ చదువుతోంది.  

రోజూ వసతిగృహం నుంచి కళాశాలకు వెళ్లి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ వసతి గృహం నుంచి అప్పుడే పుట్టిన పసికందును విసిరేయడం స్థానికులు గమనించారు. భవనంపైన బాలికలు నీళ్లతో రక్తపు మరకలు కడు­గుతూ ఉన్న దృశ్యాలను వీరు వీడియో తీసి పోలీ­సులకు సమాచారం ఇచ్చారు. ఏలూరు టూటౌన్‌ సీఐ  రమణ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లగా పసికందు విగతజీవిగా పడిఉండటాన్ని గమనించారు.

బిడ్డకు బొడ్డు కూడా ఊడకపోవటం, ఒంటినిండా రక్తపు మరకలు ఉండటంతో అప్పుడే జన్మించి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చా­రు. వసతిగృహాన్ని కూడా పోలీసు అధికారులు పరిశీలించారు. బాధిత బాలిక ఉండే గదిని పరిశీ­లించి ఆమె స్నేహితులను విచారించారు. 

ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌ వసతిగృహ నిర్వాహ­కు­లతో మాట్లాడి హాస్టల్‌లోని పరిస్థితులను పరిశీలించారు. మరోవైపు.. వసతిగృహంలో ప్రసవించిన బాలికను చికిత్స నిమిత్తం 108లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. నవ­జా­త శిశువు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. 

నిర్వాహకులు గమనించలేదా?
ఇక ఈ సంఘటనకు సంబంధించి ఆధ్మాత్మిక శిక్షణా కేంద్రంలోని మరో వసతిగృహంలో శిక్షణలో ఉన్న వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిషనరీ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఫాదర్లు తరచూ ఈ బాలికల వసతిగృహానికి వెళ్తుంటారని, ఈ క్రమంలోనే వారిలో ఒకరితో ఆమె సన్నిహితంగా ఉండడంతో బాలిక గర్భం దాల్చి­నట్లు తెలుస్తోంది.  

మిషనరీ శిక్షణ, వస­తి­గృహంలో ఉంటున్న ఒక బాలిక గర్భం దాల్చి.. ప్రసవించే వరకూ ఆమెను ఇన్ని నెలలపాటు నిర్వాహకులు గమనించకపోవడంపై సందేహాలు వ్యక్తమవు­తున్నాయి. బాలికలో చోటుచేసుకునే శారీ­రక మార్పులను సైతం అటు కళాశాలలో, ఇటు వస­తిగృహంలో ఎవరూ గుర్తించకపోవటం అను­మా­­నాలకు తావిస్తోంది.  ఇక ప్రసవం సమయంలో బాధిత బాలికకు తోటి విద్యార్థినులే సహకరించారా? లేక నిర్వాహకుల ప్రమేయం ఉందా అనేది తేలాల్సి ఉంది.

పోలీసుల అదుపులో అనుమానితుడు?
ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ మట్లాడుతూ వసతిగృహాన్ని పరిశీలించి  కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు.  కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)