Breaking News

తల్లిదండ్రులను పట్టించుకోలేదని గిఫ్ట్‌ డీడ్‌ రద్దు

Published on Fri, 06/20/2025 - 03:41

జమ్మలమడుగు: తల్లిదండ్రులను బాగా చూసు­కుంటామని నమ్మబలికి వారి ఆస్తిని రాయించుకున్న ఐదుగురు కుమార్తెలు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో కుమార్తెలకు రాసి­చ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి తిరిగి తల్లిదండ్రు­లకే వారి ఆస్తి చెందే విధంగా గురువారం జమ్మల­మడుగు ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దు­టూ­రుకు చెందిన మాలేపాటి మోహ­న్‌­రావు, గౌరమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తె­లు. సొంతంగా స్వీట్స్‌ వ్యాపారం చేసి కుమార్తెలకు అందరికీ పెళ్లిళ్లు చేశారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా వ్యాపారం నిలిపివేశారు. 

జీవిత చరమాంకంలో తమను కుమార్తెలు చూసుకుంటారనే నమ్మకంతో ప్రొద్దుటూరులోని రంగయ్యగారి సత్రంవీధిలో ఉన్న ఇంటిని 2024 జూలై 23న పిల్లలకు గిఫ్ట్‌ డీడ్‌గా రాసిచ్చారు. అప్పటివరకు బాగా చూసుకున్న కుమార్తెలు ఇల్లు రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవ­డం మానేశారు. భోజనం, మందులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. సేవాసంస్థలు, ఇరుగుపొరుగువారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కొద్దిరోజులు గడిపిన మోహన్‌రావు, గౌరమ్మ.. ఆ తర్వాత వృద్ధాశ్రమంలో చేరారు. అయినా పిల్లల తీరులో మార్పు రాకపోవడంతో జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీకి ఫిర్యాదు చేశా­రు. 

మోహన్‌రావు, గౌరమ్మ దంపతుల ఐదుగు­రు కుమార్తెలు ఫిబ్రవరి 22న తన కార్యాలయంలో హాజరుకావాలని ఆర్డీవో నోటీసులు పంపారు. ఈ ఫిర్యాదుపై మార్చి 12, 29, ఏప్రిల్‌ 19వ తేదీల్లో విచారణ జరిపారు. మోహన్‌రావు, గౌరమ్మ దంపతుల కుమార్తెలు పూర్తిస్థాయిలో విచారణకు హాజరుకాకపోవడంతోపాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. దీంతో కుమార్తెలకు ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి, తిరిగి మోహన్‌రావు దంపతులకు వారి ఇల్లు దక్కే విధంగా గురువారం ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ పత్రాలను మోహన్‌రావు దంపతులకు అందించారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)