Breaking News

రేపల్లెలో శృతిమించిన టీడీపీ దౌర్జన్యం

Published on Tue, 07/16/2024 - 05:08

సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ వారి దౌర్జన్యం శృతిమించింది. కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్‌­సీపీ  నేతలు, కార్యకర్తలు, సానుభూతి­పరులు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. గంజాయి కేసుల్లో ఇరికిస్తు­న్నారు. అధికారపక్షం కావడంతో పోలీసులు వారు చెప్పిన­ట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు­న్నా­యి.

 తాజాగా రేపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయ­కుడు రాజ్‌పాల్‌పై పోలీసులు గాంజా కేసు నమో­దు చేశారు. ఇటీవల గంజాయితో పట్టుబ­డిన ముఠాలో రాజ్‌పాల్‌ లేకున్నా పోలీసులు కేసులో అతడి పేరు చేర్చారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వాస్తవానికి రాజ్‌పాల్‌ ఓట్ల› లెక్కింపు అనంతరం టీడీపీ నేతల బెదిరింపులతో ఊరువదలి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇప్పటి­వరకు రేపల్లెకు రాలేదు. అయినా పోలీసులు అతడిపై గాంజా కేసు నమోదు చేశారు. 

తప్పుడు కేసులు మానుకోవాలి 
అధికారం శాశ్వతం కాదని, టీడీపీ నేతలు ఇప్పటికైనా తెలుసుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యక­ర్తలపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు శృతిమించాయన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా మారకపోతే తాము రోడ్డెక్కి ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.

 రేపల్లెకు చెందిన తమ పార్టీ కార్యకర్త రాజ్‌పాల్‌ యాదవ్‌పై పోలీసులతో అధికారపార్టీ నేతలు గంజాయి కేసు పెట్టించడం దారుణమన్నారు. పోలింగ్‌ నాడు టీడీపీ నాయకుడితో రాజ్‌పాల్‌ గొడవ పడ్డారని, ఆ కక్షతోనే ఇప్పుడు అతడిపై గంజాయి కేసు పెట్టించారని చెప్పారు. ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ వారి దాడులు పెరగడంతో రాజ్‌పాల్, మరికొందరు ఊరు వదలి వెళ్లారని తెలిపారు. తరువాత ఇప్పటికీ రాజ్‌పాల్‌ రేపల్లె రాలేదని చెప్పారు. 

రాజ్‌పాల్‌ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకోబోతే పరారయ్యాడని పోలీసులు కట్టుకథ అల్లి అతడిపై కేసు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారు దాడులు చేస్తారని ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్న రాజ్‌పాల్‌పై తప్పుడు కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీలు అధికారంలోకి రావడం, పోవడం సర్వసాధారణమన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. 

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)