Breaking News

పెరుగుతున్న గోదా‘వడి’

Published on Mon, 07/15/2024 - 04:16

సాక్షి, అమరావతి/ ధవళేశ్వరం: నది పరీవా­హక ప్రాం­తం (బేసిన్‌)లో వర్షాలు కురుస్తుండటంతో గోదా­వరిలో వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది. ఆది­వారం ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 88,409 క్యూసె­క్కులు చేరుతుండగా బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.30 అడుగులకు చేరింది. 

10,200 క్యూసెక్కులు గోదా­వరి డెల్టాకు విడుదల చేస్తూ మిగిలిన 78,209 క్యూసె­క్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారే­జీలో మొత్తం 175 క్రస్ట్‌గేట్లకుగాను 129 గేట్లను పైకిలేపి జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాకు విడుదల చేసిన నీటిలో తూర్పు డెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1,200, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కులు వదిలారు. 

ఆల్మట్టిలోకి 23,678 క్యూసెక్కులు
పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం వల్ల కృష్ణా, ఉపనదుల్లో వరద తగ్గింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 23,678 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదు­త్పిత్తి చేస్తూ 3,980 క్యూసెక్కులు దిగువకు వదు­లుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 90.33 టీఎంసీల నీరుంది. ఆల్మట్టి నిండాలంటే 39 టీఎంసీలు అవసరం. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర నదిలోను వరద ప్రవాహం తగ్గింది. 

తుంగభద్ర డ్యామ్‌లోకి 12,194 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 31.7 టీఎంసీలకు చేరింది. ఇక తెలుగురాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలంలోకి 1,060 క్యూసెక్కులు చేరుతుండగా.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్‌ తరలిస్తుండటంతో నీటినిల్వ 36.24 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు.   

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)