Breaking News

3 రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు

Published on Sat, 02/03/2024 - 05:17

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా విజయవంతమైంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన రైల్వే లైన్లు కోటిపల్లి– నరసాపూర్, విజయవాడ – గూడూరు, కాజీపేట – విజయవాడ మధ్య మూడో లైన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించింది. ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి ప్రాధాన్యం లభించడంతోపాటు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ పెద్ద పీట వేసింది.

2024–25కు గాను రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022–23 బడ్జెట్‌లో రూ.7,032 కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్‌లో రూ.8,406 కోట్లు కేటాయించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది  రూ.732 కోట్లు అధికంగా కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రా­ష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, తెచ్చిన ఒత్తిడితోనే రైల్వే బడ్జెట్‌ కేటాయింపులు ప్రతి ఏటా పెంచుతున్నారని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.


ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు.. (రూ.లలో)
కోటిపల్లి – నరసాపూర్‌ కొత్త లైన్‌ నిర్మాణానికి  300 కోట్లు
విజయవాడ–గూడూరు మూడో లైన్‌  500 కోట్లు
కాజీపేట – విజయవాడ మూడో లైన్‌  310 కోట్లు
విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్‌ లైన్లకు   209.8 కోట్లు
అమృత్‌ భారత్‌ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి: 425 కోట్లు
ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి: 407 కోట్లు
ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు, హైలెవల్‌ ప్లాట్‌ఫారాల నిర్మాణానికి: 197 కోట్లు
ట్రాఫిక్‌ ఫెసిలిటీ పనులకు: 172 కోట్లు
రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు: 30 కోట్లు
రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న వందేభారత్‌ రైళ్ల నిర్వహణకు: 10 కోట్లు 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)