Breaking News

పులి కోటలో ఓ రాత్రి!

Published on Fri, 12/27/2024 - 05:01

ప్రకృతి రమణీయతకు మారుపేరు నల్లమల అభయారణ్యం (Nallamala Forest). విశేషమైన వృక్ష సంపద... లెక్కలేనన్ని వన్యప్రాణులు... పక్షులు... క్రూరమృగాలు... ఔషధ మొక్కలు ఈ అడవి సొంతం. పులులకు పెట్టని కోటగా పేరొందిన నల్లమలలో జాలీగా జంగిల్‌ సఫారీ (jungle safari) చేస్తూ వన్యప్రాణులను ప్రత్యక్షంగా తిలకించేందుకు అటవీశాఖ అవకాశం కల్పిస్తోంది. 

నంద్యాల జిల్లా పరిధిలోని పచ్చర్ల, బైర్లూటిలలో ఏర్పాటుచేసిన ఎకో టూరిజం ప్రాజెక్టుల నుంచి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను అమలు చేస్తోంది. వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించేందుకు నల్లమలలోని నాగార్జున సాగర్‌ శ్రీశైలం టైగర్‌ ప్రాజెక్ట్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌) స్వాగతిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... నిర్భయంగా పులి కోటలో ఓ రాత్రి గడిపేద్దాం పదండి.

ఆళ్లగడ్డ: రోజువారీ ఉరుకుల పరుగుల జీవన పోరా­టంలో అలసిన మనసులను ఆహ్లాదపరి­చేందుకు... ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని పంచేందుకు.. నల్లమలలోని పచ్చర్ల, బైర్లూటి ఎకో టూరిజం (Eco Tourisam) కేంద్రాలు స్వాగతం పలుకుతు­న్నాయి. అహోబిలం, యాగంటి, మద్దిలేటయ్య, మహానంది, శ్రీశైల మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతోపాటు ఆసక్తిగల ప్రజలకు జంగిల్‌ సఫారీకి అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

వారాంతాలు, సెలవు రోజుల్లో కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో జంగిల్‌ సఫారీకి విచ్చేస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇక్కడి సౌందర్యాన్ని చూడ­టానికి విదేశాల నుంచి కూడా పర్యాట­కులు వస్తుండటం విశేషం. ముఖ్యంగా ఫొటో­షూ­ట్‌ల కోసం కొత్త జంటలు క్యూ కడుతున్నా­యి. 



వన నివాసం ఇలా... 
» పచ్చర్ల, బైర్లూటీ ఎకో టూరిజం క్యాంప్‌ల నుంచి ఓపెన్‌ టాప్‌ సఫారీ (జీపు)లు పర్యాటకుల కోసం అందుబాటులో ఉంటాయి. 
»   ఒక్కో వాహనంలో 10 మంది కూర్చోవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.300 చొప్పున కనీసం ఐదుగురు ఉండాలి. లేదా రూ.1,500 చెల్లించి ఒకరు, ఇద్దరు అయినా వెళ్లవచ్చు.
»   ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అడవిలో పర్యటించి క్యాంపునకు చేరుకోవాల్సి ఉంటుంది. 
»  పర్యాటకులను కనువిందు చేసేందుకు ఎకోవాక్, హెరిటేజ్‌వాక్, జంగిల్‌ సఫారీ, ట్రెక్కింగ్, కయా కింగ్, బర్డ్స్‌ బట్టర్‌ ఫ్లై గార్డెన్‌ వంటివి ఏర్పాటు చేశారు.
»   సాయంత్రం ఐదు గంటల వరకు అటవీ ప్రాంతంలో తిరిగి వచ్చినవారికి జంగిల్‌ క్యాంప్‌లో రాత్రి బస చేసేందుకు సాధారణ కాటేజీలు, మిలట్రీ టెంట్‌ హౌజ్, ఉడెన్‌ కాటేజీలతోపాటు వన కుటీర్‌ (మట్‌ కాటేజీ)లు అందుబాటులో ఉన్నాయి.
»   కాటేజీ ఒక రోజు అద్దె రూ.6 వేల నుంచి రూ.9వేల వరకు ఉంటుంది. ఇద్దరు బస చేయవచ్చు. అంతకుమించి ఉంటే ఒక్కో వ్యక్తికి అదనంగా రూ.1,500 చెల్లించాలి. 
»   కాటేజీ బుక్‌ చేసుకున్నవారికి జంగిల్‌ సఫారీ, భోజనం, టీ, టిఫిన్‌ వంటివి ఉచితం. చిన్నపిల్లలు ఆడుకునేందుకు రకరకాల ఆటవస్తువులు అంటుబాటులో ఉన్నాయి. 
»  కాటేజీ బుక్‌ చేసుకోకపోయినా ఉదయం వచ్చి ఐదుగురితో కలిసి రూ.1,500 చెల్లించి జంగిల్‌ సఫారీ చేయడంతోపాటు సాయంత్రం వరకు ఎకో టూరిజం క్యాంపులో గడపవచ్చు.

ఇలా వెళ్లాలి... 
»   నంద్యాల–గిద్దలూరు మార్గంలో నంద్యాలకు 25 కిలో మీటర్లు, గిద్దలూరుకు 35 కిలో మీటర్ల దూరంలో పచ్చర్ల ఎకో టూరిజం క్యాంప్‌ ఉంది.
»   ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో 14 కిలో మీటర్ల దూరంలో బైర్లూటీ ఎకో టూరిజం క్యాంపు ఉంది.
»  ఈ క్యాంపుల వద్దకు పర్యాటకులు రోడ్డు మార్గాన ఆర్టీసీ బస్సులు లేదా సొంత వాహనాల్లో చేరుకోవాలి. పర్యాటకుల ఆసక్తి మేరకు ఎకో టూరిజం క్యాంపుల్లో విడిది కల్పిస్తారు.
»  అక్కడి నుంచి సఫారీలో నల్లమల అందాలు తిలకించేలా అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

జంగిల్‌ సఫారీ సాగేదిలా.. 
»  క్యాంపుల నుంచి సుమారు 25 నుంచి 30 కిలో మీటర్లు నల్లమలలోని టైగర్‌ రిజర్వ్‌ ­అట­వీ ప్రాంతంలో జంగిల్‌ సఫారీ సాగు­తుంది. 
»  ఆహ్లాదకరమైన వాతావరణంలో నెమళ్లు, వివిధ రకాల పక్షులు, జింకలు, దుప్పు­లు, అడవి పందులు, కొండ గొర్రెలు, భయ­పెట్టే కొండ చిలువలు, తాచు పాములు వంటివాటి మధ్య ఈ పర్యటన ఆద్యంతం కొనసాగుతుంది. 
» మధ్యలో రెండు చోట్ల వాచ్‌ టవర్‌లను ఏర్పాటు చేశారు. సందర్శకులు వీటిని ఎక్కితే నల్లమల అంతా చూడవచ్చు. 
»  ప్రస్తుతం నల్లమలలో దాదాపు 50 చిరుత పులులు, 70 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా. అప్పుడప్పుడు చిరుత, పెద్ద పులు­లు కూడా జంగిల్‌ సఫారీలో కనిపిస్తున్నాయి.
» అడవిలోకి వెళ్లే పర్యాటకులు అటవీ సిబ్బంది ఆపిన చోట మాత్రమే కిందకు దిగాలి. అడవి మధ్యలో దిగడం, ఫొటోలు తీసుకోవడం పూర్తిగా నిషేధం.
» జంగిల్‌ సఫారీకి నల్లమలలో స్థానికంగా నివసించే చెంచులే గైడ్‌లుగా ఉంటూ చూపిస్తారు. పక్షులు, వన్యప్రాణుల విశిష­్టత­లను వివరిస్తారు. 

ఆహ్లాదకరంగా ఉంది: చందన, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, చెన్నై
స్నేహితుడి పెళ్లి తర్వాత ఆల్బమ్‌ కోసం ఫొటో షూట్‌ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ముందుగా ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని అనుకోలేదు. ఇప్పుడు మళ్లీమళ్లీ రావాలనిపిస్తోంది. చాలా బాగుంది.

మళ్లీ రావాలని అనుకుంటున్నాం: చందన, కర్నూలు
కుటుంబ సభ్యులతో కలిసి మొదటి­సారి ఇక్కడికి వచ్చాం. పచ్చర్ల జంగిల్‌ సఫారీ చాలా బాగుంది. మరోసారి బంధువులు అందరితో కలిసి రావాలని అనుకుంటున్నాను. అడవి వాతావరణంలో విహరించడం అద్భుతంగా ఉంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)