Breaking News

వేసవిలోను నిరంతర విద్యుత్‌

Published on Tue, 05/16/2023 - 03:38

సాక్షి, అమరావతి: వేస­విలో విద్యుత్‌ డిమాండ్‌ అధికమవు­తున్నా ప్రణాళికాయుతంగా విద్యుత్‌ ఉత్పాదనను సాగిస్తూ, ప్రజలకు కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ­చంద్రారెడ్డి చెప్పారు. ఆయన సోమ­వారం సచివాలయంలో ఇంధనశాఖ, ఆంధ్రప్రదేశ్‌ మధ్యప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లోను ఇదే తరహాలో విద్యుత్‌ సరఫరా కొనసాగుతుందని తెలిపారు.

33 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో సబ్‌స్టేషన్‌ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తు­న్నట్లు చెప్పారు. ఈ కమిటీలు తమ పరిధిలో విద్యుత్‌ డిమాండ్, లో ఓల్టేజీ, విద్యుత్‌ సరఫరా తదితర అన్ని అంశాలను పరిశీలిస్తాయని, మెరుగైన విద్యుత్‌ సరఫరాకు సహకరిస్తా­యని తెలిపారు. దరఖాస్తు చేసిన ప్రతి రైతుకు అర్హతే ప్రామాణికంగా ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని, తొమ్మిది గంటలపాటు పగటిపూట ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. ఉచిత విద్యుత్‌ దర­ఖాస్తులకు గడువు ఉండకూడదన్నారు.

ఇప్ప­టి­వరకు వచ్చిన దరఖాస్తులను జూన్‌ 15వ తేదీలోగా పరిష్కరించి కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి వ్యవసాయానికి దాదాపు 1.20 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు డిస్కం అధికారులు తెలి­పారు. జగనన్న హౌసింగ్‌ కాలనీలకు విద్యుదీకరణను గడువులోగా పూర్తిచేయా­లని మంత్రి కోరారు. పంపిణీ నష్టాలను పూర్తిస్థాయిలో నియంత్రణలోకి తీసుకురావాలని, పారిశ్రామికసంస్థల బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు.

ఇప్పటికే పనులు అప్పగించిన సబ్‌స్టేషన్ల నిర్మా­ణాలను వేగవంతం చేయాలన్నారు. లో ఓల్టేజీ ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయా­నంద్, ఏపీ జెన్‌కో ఎండీ కె.వి.ఎన్‌.చక్రధర్‌బాబు, సీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి పాల్గొన్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)