Breaking News

చిన్నారులపై అకృత్యాలు దారుణం

Published on Sun, 08/11/2024 - 06:10

గుంటూరు వెస్ట్‌ : అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రస్తుత కాలంలో కూడా చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాప్‌లు, హత్యా నేరాలు పెరగడం అత్యంత దారుణమని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో (జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ) విభిన్న ప్రతిభావంతుల బాలల హక్కుల పరిరక్షణపై స్టేక్‌ హోల్డర్స్‌తో శనివారం గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన వార్షిక రాష్ట్రస్థాయి సమా­వేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ.. రాకెట్‌ సైన్స్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో మానవ ఆలోచనా విధానం ఆదర్శ­ప్రాయంగా ఉండాలన్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. జాతీయ క్రైం బ్యూరో 2023 గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,62,000 మంది బాలలపై నేరాలు జరిగాయన్నారు. 83,350 మంది చిన్నారుల మిస్సింగ్‌ కేసులు నమోదయ్యా­యని.. బాలలపై కిడ్నాపింగ్, బలవంతపు నేరాలు 45 శాతం ఉన్నాయన్నారు.

ఇక దేశంలో లైంగిక వేధింపులకు గురైన వారి సంఖ్య 2021 కంటే 2022లో మరింత పెరిగాయన్నారు. పోక్సో (ప్రొటె­క్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌) చట్టం ద్వారా కఠినమైన శిక్షలు వేస్తున్నా నేరాలు మాత్రం తగ్గడంలేదన్నారు. ఎన్‌సీఆర్‌బీ రికార్డు ప్రకారం.. 1,004 కేసుల్లో 900 కేసులు తెలిసినవారి కారణంగా జరిగినవేనని  చెబుతూ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. బాలలు బలహీ­నులు, వారేమీ చేయలేరు, ఎవరికీ చెప్పు­కోలేరని చాలామంది దాడులకు తెగబడుతు­న్నారని.. ఈ విధానం మారాలన్నారు. 

సామాజిక బాధ్యతగా బాలల రక్షణ..
సమావేశంలో జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ చైర్‌పర్సన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి. నరేందర్‌ మాట్లాడుతూ.. బాలల రక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. జువెనైల్‌ జస్టిస్‌ చట్టం అనేది రక్షణ, సంరక్షణ అవసరమైన చిన్నారుల కోసం మాత్రమే కాదని.. తీవ్రమైన నేరారోపణలకు గురయ్యే పిల్లల సంరక్షణ కోసం కూడా ఉద్దేశించబడిందని వివరించారు. చట్టాలు అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనా ఎంతో ఉందని చెప్పారు. అనంతరం.. చిన్నారులుతో ముచ్చటించారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా న్యాయస్థానాల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

#

Tags : 1

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)