Breaking News

కూటమి నేతలు ఇసుకను దోచేస్తున్నారు

Published on Mon, 01/06/2025 - 05:52

ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత ఇసుక విధానం దుర్వినియోగమవుతోందని.. పేద­లకు దక్కాల్సిన ఇసుకను కూటమి నేతలు దోచుకు­పోతున్నారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక­వర్గం­లో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడు­తున్నా పట్టించు­కోకుండా సీఎం చంద్రబాబు మొద్దునిద్ర నటిస్తు­న్నా­రంటూ విమర్శించారు. 

జొన్నాడ ఇసుక ర్యాంపు­లో రోజురోజుకూ పెరిగిపోతున్న ఇసుక అక్రమా­లపై వివిధ దినపత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వరుస కథనాలు వెలువడటంపై జగ్గిరెడ్డి స్పందించి ఆదివారం జొన్నాడలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.. ఆయన సోద­రుడు, జనసేన పార్టీ ఇన్‌చార్జి బండారు శ్రీనివాసు నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులను పంచేసుకు­న్నారని ఆరోపించారు. 

ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్‌ ఇసుకకు రూ.300 వసూలు­చేయాల్సి ఉండ­గా కూటమి నేతలు రూ.600 వసూలు చేస్తున్నార­న్నారు. ఇసుక ర్యాంపుల నుంచి కూటమి నేతల ద్వారా ప్రతినెలా మామూళ్ల కింద సుమారు రూ.రెండుకోట్ల వరకూ ఎమ్మెల్యే బండారుకు అందుతున్నాయని ఆరోపించారు. అలాగే, కూటమి నేతలు రాత్రి వేళల్లో లారీల్లో నింపి బయటకు తరలించి రూ.లక్షల్లో అవినీతికి పాల్పడుతున్నా­రన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నామ­మాత్రపు ధరకు ఇసుకను సరఫరా చేసిందని ఆయన గుర్తుచేశారు. 

ఇసుక గుట్టలు సీజ్‌ చేయాలి..
ఇక కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుట్టలను సత్వరమే సీజ్‌ చే­యా­లని జగ్గిరెడ్డి డిమాండ్‌ చేశారు. మైన్స్‌ అధికారులు మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారే తప్ప ఇసుక దొంగలను గుర్తించడంలేదన్నారు. 

ఇసుక గుట్టలను సీజ్‌చేసి అక్రమ తవ్వకాలను నియంత్రించకుంటే అధికారులను దోషులుగా గుర్తించాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక ఏటిగట్టు పక్కన నిల్వ ఉంచిన ఇసుక గుట్టల పైనుంచి జగ్గిరెడ్డి సెల్ఫీ దిగి.. దమ్ముంటే ఇసుకాసురులపై చర్యలు తీసుకో­వాలని సీఎం చంద్రబాబుకు చాలెంజ్‌ విసిరారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)