Breaking News

ఆపరేషన్‌.. పెరంబులేషన్‌

Published on Thu, 02/06/2025 - 05:14

తిరుపతి సిటీ: చిరుత జాడ కోసం పెరంబులేషన్‌ పేరుతో తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇందులో ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది, వర్సిటీ సెక్యూరిటీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వీయూలో రెండు నెలలుగా చిరుత సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు వర్సిటీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు అమర్చి చేయి దులుపుకున్నారు. 

అయితే మంగళవారం సాయంత్రం వర్సిటీ సెంట్రల్‌ లైబ్రరీ ప్రాంగణంలో చిరుత విద్యార్థుల కంట పడింది. వెంటనే వారు అటవీ, వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. ఉలిక్కిపడిన అధికారులు చిరుతకు పిల్లలు ఉంటేనే తరచూ వర్సిటీలో సంచరిస్తోందన్న అనుమానంతో బుధవారం వంద మందితో నాలుగు బృందాలుగా ఏర్పడి సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అయినా చిరుత పిల్లల ఆచూకీ లభించలేదు. 

జిల్లా ఉప అటవీశాఖ అధికారి నాగభూషణం వర్సిటీలో మీడియాతో మాట్లాడుతూ చిరుతను బంధించేందుకు నాలుగు రోజుల ముందు బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదన్నారు.  వర్సీటీ రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ హరిక్రిష్ణ, అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)