Breaking News

'కాఫీ' పెట్టండి.. సారూ!

Published on Mon, 02/23/2026 - 05:32

బి.కొత్తకోట: మూడున్నర దశాబ్దాల క్రితం అటవీశాఖ చేసిన ఓ మంచి కాఫీ లాంటి ప్రయోగం ఫలించగా, ఆచరణలో విఫలమైంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉన్న అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని వేసవి విడది కేంద్రం, ఆంధ్రాఊటీ హార్సిలీహిల్స్‌ ప్రకృతి ప్రయోగాలకు వేదిక. ఇందులో ఎన్నో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అందులో మొక్కలపై ఎన్నో ప్రయోగాలు చేయగా వాటి ఆనవాళ్లు ఇప్పుడు లేవు. ఇందులో ఒకటి కాఫీ మొక్కల పెంపకం.  అరకు లాంటి ప్రాంతాలకే పరిమితమైన కాఫీతోటల పెంపకం 1990లో ప్రయోగాత్మకంగా హార్సిలీహిల్స్‌పై చేపట్టారు.  

ప్రయోగం ఫలించింది 
మొదటి సారిగా 1990లో ఇక్కడ కాఫీతోటలు సాగు చేయాలన్న ఆలోచన అటవీశాఖకు కలిగింది. దాంతో అప్పటి అధికారులు కాఫీ మొక్కలను నాటి వాటి ఎదుగుదల, దిగుబడి, నాణ్యతను పరిశీలించారు. వాటిని నాటిన తర్వాత అవి మొక్కలై మంచి దిగుబడి ఇవ్వడంతో పాటు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. దాంతో సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో.. వేసవిలో సాధారణ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, శీతాకాలం ఉదయం సమయంలో ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోతుంది. 

ఈ స్థాయి ఉష్ణోగ్రతలున్నా కాఫీతోటల పెంపకం విజయవంతమైంది. కొండపైన అటవీప్రాంగణం, ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద కాఫీ తోటలను పెంచారు. ఇవి ఏటా దిగుబడిని ఇస్తున్నాయి. అయితే వీటి నిర్వహణ సక్రమంగా లేకపోయినా దిగుబడి బాగా వస్తోంది. ప్రస్తుతం కాఫీ మొక్కల నిండా గింజలు కనిపిస్తున్నాయి. ఈ మొక్కల భాగాలను కత్తిరించి వేయడంతో ఒక స్థాయి వద్ద ఎదుగుదల ఆగిపోయింది.  

సేకరణ వదిలేశారు:  కొండపై రెండుచోట్ల ఉన్న కాఫీతోటల నుంచి మంచి దిగుబడి వస్తోంది. వీటినుంచి మొదట్లో  కాఫీ గింజలను సేకరించారు. తర్వాత దీనిపై నిర్లక్ష్యం పెరగడంతో వాటి నిర్వహణ, సస్యరక్షణ చర్యలను పూర్తిగా వదిలేశారు. దీనిఫలితంగా దిగుబడి వస్తున్నా వాటిని ఆదాయంగా మార్చుకునేందుకు అటవీశాఖ ఆసక్తి చూపడం లేదు. ఈ దిగుబడిలో కొంత కోతులు తింటుండగా, మిగిలినవి వృధాగా నేలరాలిపోతున్నాయి. ఆదాయం వచ్చే ఈ కాఫీ గింజలను సేకరించేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదు.  

విస్తరిస్తే పరిశ్రమ అవుతుంది 
తూర్పు కనుమలతో విడిపడిన హార్సిలీహిల్స్‌ దట్టమైన అడవులతో కూడుకున్నది. జీవవైవి« ద్యం పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కొండ అడవి తూర్పున కురబలకోట మండలం, దక్షిణాన కర్ణాటక రాష్ట్రానికి విస్తరించి ఉంటుంది. 8,755 హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అటవీప్రాంతం ఉంది. ఇందులో రిజర్వ్‌ఫారెస్ట్‌ 6,231 హెక్టార్లుందని 1882లోనే 16వ సెక్షన్‌ కింద  ప్రభుత్వం ప్రకటించింది. కాఫీ తోటల పెంపకం విజయవంతమైంది. 

దీన్ని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ అడవిలో, ఘాట్‌రోడ్డు సమీపంలోని మైదాన భూమిపై వీటిని పెంపకాన్ని చేపట్టి విస్తరిస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఉపా«ధి, ఉద్యోగ అవకాశాలు కలగడంతోపాటు అరకు కాఫీ లాగా హార్సిలీహిల్స్‌ పేరు బ్రాండ్‌గా మారే అవకాశం లేకపోలేదు. ఈ దిశగా అటవీశాఖ చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి.  

విస్తరణకు పరిశీలన  
హార్సిలీ హిల్స్‌ పై కాఫీ తోటల నిర్వహణ, విస్తరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అటవీ ప్రాంగణంలో కొత్తగా కాఫీ తోటల పెంపకానికి భూమి లేదు. కొండలో అనువైన ప్రాంతాన్ని గుర్తించి.. దీనిపై నివేదిక ప్రభుత్వాన్ని పంపుతాం. తోటల నుంచి గింజలను సేకరించేందుకు చర్యలు తీసుకుంటాం.   – జయప్రసాదరావు, మదనపల్లె రేంజర్‌ 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)