Breaking News

‘పటమట’ పాట.. రూ.2 కోట్ల పైమాట

Published on Sat, 08/24/2024 - 05:27

సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి  :  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది. లావాదేవీలు, ఆదాయం ఎక్కువగా వచ్చే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పోస్టులపైన అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. ఆ కార్యాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌గా వచ్చేందుకు ధర నిర్ణయించి వేలం పాట పెట్టేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఈ పాటలో ఎవరెక్కువ మొత్తం చెల్లిస్తారో వారిని ఆయా పోస్టుల్లో కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతు­న్నారు. 

ఇందులో భాగంగా.. నిబంధనలతో సంబంధం లేకుండా సబ్‌ రిజిస్ట్రార్లంతా బదిలీలకు ఆప్షన్‌ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి అనధికా­రిక ఆదేశాలు అందడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మెసెంజరు ద్వారా ఉత్తర్వులు అందించి, రిక్వెస్ట్‌ ఫారాలను వాట్సప్‌లో పంపారు. బదిలీ అభ్యర్థ­నలను శుక్రవారం మధ్యాహ్నంలోపు పూర్తిచేసి పంపాలని షరతు విధించారు. 

వారు బదిలీ కోరుకుంటున్న స్థానాల ఆప్షన్లతోపాటు గతంలో వారు పనిచేసిన సెంటర్లు, వారిపై ఉన్న కేసులు, సర్వీసు తదితర వివరాలన్నింటినీ ఫామ్‌లో పూర్తిచేయా­లని సూచించారు. సబ్‌ రిజిస్ట్రార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, ఇతర కార్యాలయ సిబ్బంది ఇది తప్పక పాటించాలని ఆదేశించారు. అయితే, ఇది ఎవరు జారీచేశారో ఆ ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్హం. అసలు బదిలీ స్థానాలు గుర్తించకుండా, ఎవరు బదిలీలకు అర్హులో తేల్చకుండా ఆప్షన్లు ఇవ్వాలని సూచించడం బలవంతపు బదిలీలకు ఒత్తిడి చేయడమేనని ఆ శాఖలో గగ్గోలు మొదలైంది.  

డిమాండ్‌ ఉన్న పోస్టులకు గిరాకీ..
ఎక్కువ రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు, అధిక ఆదాయం వచ్చే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డిమాండ్‌ ఉన్న పోస్టులకు గిరాకీ 
ఏర్పడింది. దీనిని అసరాగా చేసుకుని, చినబాబు కనుసన్నల్లోనే నడిచే టీం ఈ పోస్టులకు «ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది.
»  ఇందులో మొదటి స్థానంలో విజయవాడ పటమట రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు స్టాండర్డ్‌ ధర 
రూ.2 కోట్లుగా నిర్ణయించి, అంతకంటే ఎక్కువ ఇచ్చుకునే వారికే పోస్టింగ్‌ ఇవ్వనున్నట్లు ఈ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది.  ఈ పోస్టుకోసం గుణదల, కంకిపాడు, రావులపాలెం సబ్‌రిజిస్ట్రార్లతో పాటు, ప్రస్తుత సబ్‌ రిజిస్ట్రార్, ఐజీకి సన్నిహితంగా ఉండే వారూ పోటీపడుతున్నట్లు సమాచారం. 
» ఇక రెండవ వరుసలో గాంధీనగర్, గన్నవరం, కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రూ.కోటికి పైగా ధర పలుకుతున్నాయి. ఈ జాబితాలో గుంటూరు జిల్లా మంగళగిరి, నల్లపాడు, గుంటూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి.
» అలాగే, విజయవాడ పరిధిలోని నున్న, గుణదల,  ఇబ్రహీంపట్నం, నందిగామ, బాపులపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులూ రూ.70 లక్షల వరకు పలుకుతున్నాయి.
»  విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులకు ఇప్పటికే లోపాయకారీగా వేలం పాట జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

.. ఇలా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల ఆధారంగా ధరలు ఫిక్స్‌ చేసి బదిలీల బేరసారాలకు తెరలేపారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రిని కూడా డమ్మీచేసి, ఈ బదిలీల వ్యవహారాలను చినబాబే నేరుగా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

మార్గదర్శకాలకు భిన్నంగా ‘చిన్నబాబు’ పెద్ద స్కెచ్‌..
నిజానికి.. ఉద్యోగుల సాధారణ బదిలీలకు వీలుగా ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకనుగుణంగా ఆయా శాఖలు మళ్లీ ప్రత్యేకంగా మార్గదర్శకాలిచ్చి బదిలీలు జరపాల్సి వుంది. కానీ, రిజస్ట్రేషన్ల శాఖలో ఈ మార్గదర్శకాలు ఇంకా జారీకాలేదు. అయినా, సబ్‌ రిజిస్ట్రార్లు తాము బదిలీ కోరుకునే స్థానాలకు సంబంధించిన ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి సందేశాలు వచ్చాయి. వీటిని అడ్డంపెట్టుకుని ‘చినబాబు’ టీం పెద్ద స్కెచ్‌ వేస్తోంది. 

డిమాండ్‌ ఉన్న పోస్టుల పేరుతో భారీగా దండుకునేందుకే అందరినీ దరఖాస్తు చేసుకోవాలని అనధికారికంగా ఆదేశాలిచ్చింది. తద్వారా తమకు కావల్సిన వారిని ఎంపిక చేసుకోవడం, కీలకమైన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఎవరు రేసులో ఉన్నారో తెలుసుకో­వడానికే కౌన్సిలింగ్‌ ముందు ఈ సందేశాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా ఆప్షన్లు అడగలేదని, కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీలు జరిపేటప్పుడు ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని అధికారులు చర్చించుకుంటున్నారు. 

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)