Breaking News

తృణమే ఘనం

Published on Tue, 07/01/2025 - 02:46

సాక్షి, అమరావతి: అటు దేశవ్యాప్తంగానూ, ఇటు రాష్ట్రంలోనూ తీసుకుంటున్న ఆహార సమూహంలో తృణ ధాన్యాల వాటానే అధికం. అలాగే పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల ఆహార సమూహంలోనూ తృణ ధాన్యాలదే పెద్దపీట. దేశంతోపాటు, ప్రధాన రాష్ట్రాల్లో తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం లాంటి ఐదు ఆహార సమూహాల్లో ఏమేర ప్రోటీన్లు తీసుకుంటున్నారు అనే అంశంపై విభజిస్తూ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తృణ ధాన్యాల వినియోగంలో జార్ఖండ్‌ తొలి స్థానంలో నిలవగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే 37.2 శాతం వినియోగంతో 14వస్థానంలో ఉంది. అటు పట్టణ ప్రాంతాల్లో తృణ ధాన్యాల వాడకంలోనూ ఈ రాష్ట్రాలే ముందువరుసలో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌ వరుసగా నిలిచాయి.

ఇక ఏపీ లో చూస్తే 34.6 శాతంతో 13 వస్థానంలో ఉంది. ఆహారంలో అత్యధికంగా గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో చూస్తే కేరళ అగ్రగామిగా ఉంది. ఈ రాష్ట్రంలో తృణ ధాన్యాల వినియోగం వాటా మిగతా రాష్ట్రాలతో పోల్చితే తక్కువ. గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో రాజస్థాన్‌ చిట్ట చివర ఉంది. ఈ రాష్ట్రంలోని  గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం ఉండగా, పట్టణాల్లో 2.5 గా నమోదైంది.  

రాష్ట్రంలో పెరిగిన వినియోగం 
ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే..2022–23 కంటే 2023–24లో ఆహారంలో గుడ్లు, చేపలు, మాంసం వాటా పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2022–23లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వీటి వాటా 19.1 శాతం ఉండగా, 2023–24లో 19.3 శాతానికి పెరిగింది. అటు పట్టణాల్లో చూస్తే 2022–23 లో 18 శాతం ఉండగా 2023–24లో 19.1 శాతానికి పెరిగింది.    

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)