Breaking News

సామాజిక వైద్యుడు వైఎస్సార్‌

Published on Wed, 09/03/2025 - 04:12

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలతో.. చిరునవ్వుతో కూడిన పలకరింపుతో ప్రతి గుండెను కదిలించిన సామాజిక వైద్యుడు, మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని నివాళులర్పించారు. మంగళవారం మహానేత వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 

ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పేదలకు దుస్తుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. పేదరికం, వెనుకబాటుతనాన్ని పారద్రోలడానికి సిద్ధాంతాలు, సమీక్షల పేరుతో కాలయాపన చేయడం సరైన విధానం కాదని, సహజ స్వభావాలతో ఆలోచించి చికిత్స చేయాలని నిరూపించిన సామాజిక వైద్యుడు రాజశేఖరరెడ్డి అని చెప్పారు. రైతులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారిని ముందుకు నడిపించిన మహోన్నత నాయకుడు అన్నారు. 

సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పెనుమార్పులు తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్‌ అన్నారు. ఉచిత విద్యుత్‌ ద్వారా ఎంతోమంది రైతులకు, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా కోట్ల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన ఆదర్శప్రాయుడు వైఎస్‌ అని గుర్తు చేశారు.

వైఎస్సార్‌ ఆశయాలకు ప్రతిరూపం వైఎస్‌ జగన్‌ 
వైఎస్సార్‌ మనకు దూరమైనా వైఎస్‌ జగన్‌ రూపంలో గొప్ప వారసత్వాన్ని అందించారని సజ్జల పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్‌ జగన్‌ విజయవంతమయ్యారని, వైఎ­స్సార్‌సీపీని ఏర్పాటు చేసి ఈ ప్రజా సంకల్పంలో మనల్ని అందర్నీ భాగస్వాముల్ని చేసినందుకు గర్వంగా భావిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలకు వైఎస్సార్‌ బీజం వేస్తే ఐదేళ్ల పాలనలో అంతకన్నా మెరుగ్గా మరిన్ని పథకాలను వైఎస్‌ జగన్‌ ముందు­కు తీసుకెళ్లగలిగారని చెప్పారు. 

కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్‌రావు, పూనూరు గౌతమ్‌రెడ్డి, కాకుమాను రాజశేఖర్, పోతిన మహేష్, చల్లా మధు, కొమ్మూరి కనకరావు, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, పార్టీ గ్రీవెన్స్, లీగల్, యువజన, మహిళా విభాగాల నాయకులు పాల్గొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)