Breaking News

ముంచెత్తిన గోదావరి

Published on Mon, 08/03/2026 - 04:11

సాక్షి, అమలాపురం:  అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం ఎగు­వ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టినా.. దిగువన కోనసీమలో మాత్రం నీరు చేరుతోంది. జిల్లాలోని పది మండలాల్లో సుమారు 19 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. రహదారులు, కాజ్‌వేలు నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యకార గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.  

వరద ముంపులోనే... 
»  పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వీటితో పాటు మలికిపురం, సఖినేటిపల్లి, ఐ.పోలవరం, అల్లవరం, కాట్రేనికోన, కె.గంగవరం మండలాల్లోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీపాయలను ఆనుకుని ఉన్న లోతట్టు గ్రామాల్లోకి నీరు చేరింది. 
»  పి.గన్నవరం మండలంలో జి.పెదపూడిలంక, బూరుగులంక, ఉడిముడిలంక, అరిగెలవారిపేట, కె.ఏనుగుపల్లి, జొన్నలంక, శివాయిలంక, పల్లెపాలెం ప్రాంతాలు ఆదివారం మధ్యాహ్నం నుంచి ముంపులో ఉన్నాయి.  
»  ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ ఠాన్నేల్లంక శివారు పల్లెపాలెం, గురజాపులంక, చింతపల్లి లంకలను వరద చుట్టుముట్టింది. గురజాపులంక రోడ్డు పూర్తిగా నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి.  
»  అయినవిల్లి మండలం ఎదురుబిడియం, పి.గన్నవరంలో గంటి పెదపూడి కాజ్‌వేలు మునిగిపోవడంతో ప్రజల రాకపోకల కోసం పడవలను ఏర్పాటు చేసుకున్నారు. 
»  వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలను ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాలు ముంపునకు గురయ్యాయి.  
»  ముమ్మిడివరం లంకాఫ్‌ ఠాన్నేల్లంక మత్స్యకార కాలనీ, అల్లవరం బోడసుకుర్రు పల్లిపాలెం, కోటిపల్లి గ్రామాల్లో ఇళ్ల మధ్యకు నీరు చేరింది. 

తగ్గుముఖం పట్టిన గోదావరి ఉధృతి 
ధవళేశ్వరం: ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి ఆదివారానికి తగ్గుముఖం పట్టింది. బ్యారేజీæ వద్ద ఆదివారం రాత్రి 7 గంటలకు 14.60 అడుగులకు నీటిమట్టం చేరింది. 14,11,474 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువన నీటిమట్టాలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమ­వారం రాత్రికి ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికలను పూర్తిగా ఉపసంహరించే అవకాశం ఉంది. గోదావరి డెల్టా కాలువలకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

ఇందులో తూర్పు డెల్టాకు 4,400, మధ్య డెల్టాకు 1,000, పశ్చిమ డెల్టాకు 3,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ భద్రాచలంలో 42.70 అడుగులకు నీటి మట్టం చేరడంతో ప్రమాద హెచ్చరికలను పూర్తిగా ఉపసంహరించారు. ఎగువ ప్రాంతా­లకు సంబంధించి కాళేశ్వరంలో 9.88 మీటర్లు, పేరూరులో 14.25 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.25 మీటర్లు, కూనవరంలో 20.42 మీటర్లు, కుంటలో 11.59 మీటర్లు, పోలవరంలో 13.10 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్‌ వద్ద 16.94 మీటర్ల వద్ద నీటి మట్టాలు నెలకొన్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)