Breaking News

అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌పై బదిలీ వేటు

Published on Sat, 07/26/2025 - 05:01

సాక్షి, అమరావతి: అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతా­ప్‌­పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రూ.252 కోట్ల కాంట్రాక్టు పనులను అస్మదీయ సంస్థలకు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్నందునే ఆయన్ని బదిలీ చేసింది. ర­హ­దారి భద్రతా విభాగం డీజీగా అప్రాధాన్య పోస్టు­లో ఆ­య­న్ను నియమించింది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అగ్ని­మాపక శాఖ ఆధునీకరణకు కేంద్ర ప్రభు­త్వం రూ.252 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో చేపట్టే పనులను తమ బినామీకి అప్పగించాలని ప్రభుత్వంలో కీలక నేత ఒకరు పట్టుబట్టారు. అందుకు డీజీ మా­ది­రెడ్డి ప్రతాప్‌రెడ్డి సమ్మతించలేదు. 

నిబంధనల మేరకే వ్యవహ­రి­స్తానని తేల్చిచెప్పారు. మరోవైపు.. పరిశ్రమలు, వ్యా­పార, విద్యా సంస్థలను తనిఖీల పేరుతో వేధించాలని ఆ కీలక నేత చెప్పారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలన్నారు. అలా చేస్తే పరిశ్రమలు, వ్యాపా­ర, విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడవచ్చన్నది ఆ నేత ఉద్దేశం. అందుకు కూడా డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌ సమ్మతించలేదు. నిబంధనల మేరకే తనిఖీలు నిర్వహిస్తామని, అక్రమ వేధింపులకు పాల్పడబోమని తేల్చిచెప్పారు. 

తన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు స్పష్టంచేశారు. దీంతో, ఆ కీలక నేత భగ్గుమన్నారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఐజీ స్థాయి అధికారికి అగ్నిమాపక శాఖ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించా­రు. ఆయన ద్వారా రూ.252 కోట్ల కాంట్రాక్టులు తమ అస్మ­దీయులకు కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. ఆ నేత ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గింది. దీంతో.. మాదిరెడ్డి ప్రతాప్‌ను బదిలీ చేసిందని పోలీసు శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.  

మాదిరెడ్డి ప్రతాప్‌ స్థానంలో వెంకట రమణ.. 
మాదిరెడ్డి ప్రతాప్‌ను రహదారి భద్రతా విభాగం డీజీగా నియమించిన ప్రభుత్వం.. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ వెంకటరమణకు పూర్తి అదనపు బాధ్యతలతో ఆ శాఖ డీజీగా నియమించింది. అలాగే, వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ అధి­కారి ఎస్వీ శ్రీధర్‌రావును సీఐడీ విభాగం ఎస్పీగా నియమించింది. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)