Breaking News

Anakapalli: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బోగీలు దగ్ధం

Published on Mon, 12/29/2025 - 05:08

సాక్షి,అనకాపల్లి: ఎలమంచిలి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సోమవారం టాటా నగర్ నుండి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలును ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపివేశారు. అగ్నిప్రమాదంపై రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.రైలు నిలిపివేయగానే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. అయితే రైల్వే అధికారులు, సిబ్బంది చాకచక్యంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఒక బోగీలోని ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనలో మొదటగా బీ1 బోగీలో మంటలు చెలరేగగా.. అనంతరం ఎం1,బీ2  కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా వాటిని వేరు చేసి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)