Breaking News

ఆఖరి మజిలీలో ఆర్థిక అభద్రత

Published on Mon, 06/17/2024 - 03:57

సాక్షి, అమరావతి: జీవిత చరమాంకంలో ఆర్థిక అభద్రతతో పండుటాకులు విలవిల్లాడుతున్నాయి. దేశంలో సగానికిపైగా వృద్ధుల్లో ఈ సమస్య ప్రబలంగా ఉంది. ఈ విషయం ఇటీవల హెల్ప్‌ ఏజ్‌ ఇండియా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ‘ఏజింగ్‌ ఇన్‌ ఇండియా’ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. 

సర్వేలో భాగంగా 10 రాష్ట్రాల్లోని 20 టైర్‌ 1, 2 నగరాల్లో 60 నుంచి 80 ఏళ్లు పైబడిన 5,169 మంది వృద్ధులు, 1,333 మంది సంరక్షకులను సర్వే చేశారు. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని టైర్‌ 1 చెన్నై, బెంగళూరు, టైర్‌ 2 సేలం, హుబ్లీ నగరాలను సర్వే కోసం ఎంపిక చేశారు. 

కాగా, సేకరించిన అభిప్రాయాలను అధ్యయనం చేసిన అనంతరం ప్రతి ముగ్గురిలో ఒకరు గత సంవత్సర కాలంలో ఎటువంటి ఆదాయం పొందలేదని గుర్తించారు. 65 శాతం మంది ఆర్థికంగా అభద్రతా భావంతో జీవిస్తున్నట్లు నిర్ధారించారు. 29 శాతం మంది వృద్ధాప్య పెన్షన్, ప్రావిడెంట్‌ ఫండ్, సామాజిక భద్రతా పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారు.  

అభద్రతాభావం మహిళల్లోనే అధికం 
తమ ప్రస్తుత రాబడి, పెట్టుబడులు, పొదుపు పరిగణనలోకి తీసుకుని 65 శాతం మంది ఆర్థి­కంగా అభద్రతతో ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ఇక మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 90 శాతం, తమిళనాడులో 38 శాతం మంది అభద్రతా భావాన్ని వ్యక్తపరిచారు. 15 శాతం మంది వృద్ధులు నేటికీ పనిచేస్తున్నారు. వీరిలో 85 శాతం మంది అక్షరాస్యులుగా ఉన్నారు.  

48 శాతం బీపీ.. 43 శాతం షుగర్‌ సమస్యలు 
68శాతం మంది వృద్ధులు తమ సాధారణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. 10శాతం మంది మాత్రం తమ ఆరోగ్యం బాగోలేదన్నారు. మొత్తంగా పరిశీలిస్తే 48 శాతం మంది బీపీ, 43 శాతం మంది షుగర్‌ సమస్యలతో బాధపడుతున్నారు. 35 శాతం మంది ఎముకలు, కీళ్లకు సంబంధించిన అర్థరైటీస్‌ వంటి వ్యాధులను ఎదుర్కొంటున్నారు.

19 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్  వంటి సమస్యలున్నాయి. అదే 80 ఏళ్లు పైబడిన వారిలో అయితే 62 శాతం మంది బీపీ, 54 శాతం మందిలో షుగర్‌ సమస్యతో ఉన్నట్టు తేలింది. 60 ఏళ్లు పైబడిన వారిలో 54 శాతం మంది నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌తో బాధపడుతున్నారు. 79 శాతం మంది రెగ్యులర్‌ చెకప్‌లు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నారు.   

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)