Breaking News

మాటిచ్చారు.. నెరవేర్చారు 

Published on Tue, 08/29/2023 - 02:36

నగరి: చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో నగరి డిగ్రీ కళాశాల హెలిపాడ్‌ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయా­లని కలెక్టర్‌   ఎస్‌.షణ్మోహన్‌కు ఆదేశాలిచ్చారు. సీఎం జగన్‌ ఆదేశాల మేర­కు యంత్రాంగం గంటల వ్యవధిలోనే ఆయా సమస్యలను పరిష్కరించింది. 

మానవత్వంతో ఆదుకున్నారు 
నగరి మండలం మిట్టపాలెంకు చెందిన ఎ.నాగరాజు సీఎం వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డిని కలిసి తన కిడ్నీలు పని చేయడం లేదని.. డయాలసిస్‌ చేయించుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ముస్లిం మహిళ తన ఆరేళ్ల కుమారుడు రెహమాన్‌తో సీఎం జగన్‌ను కలిసింది. తన కుమారుడు బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని.. వైద్యం కోసం ఖర్చయిన బిల్లులను మంజూరు చేయాలని వేడుకుంది.

కార్వేటినగ­రం గొల్లకండ్రిగకు చెందిన చందు అనే బాలిక తన తండ్రితో వచ్చి సీఎం జగన్‌ను కలిసింది. తాను బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని.. వైద్యం కోసం వెచ్చించిన బిల్లులను మంజూరు వేడుకుంది. శ్రీకాళహస్తి మండ­లం తూకివాకం గ్రామానికి చెందిన ఐశ్వర్య సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి తన ఇద్దరు బిడ్డల ఆరోగ్య సమస్యను వివరించి ఆదుకోవాలని కోరింది.

వీరందరికీ మెరుగైన వైద్యం అందించాలని.. వైద్య ఖర్చుల కోసం వెచ్చించిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. తక్షణం స్ప­ం­దించిన కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ ఎ.నాగరాజుకు రూ.లక్ష, రెహమాన్‌కు రూ.లక్ష, ఎం.చందుకు రూ.50 వేలు, ఐశ్వర్యకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు.

ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం 
విజయపురం మండలం పన్నూరుకు చెందిన కె.షణ్ముగం, నగరి మండలం నెత్తం కండ్రిగకు చెందిన గజేంద్ర, మత్తయ్య అనే దివ్యాంగులతోపాటు ఎస్‌ఆర్‌ పురం మండలం పుల్లూరు హరిజనవాడకు చెందిన ఎన్‌.సుమిత్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో షణ్ముగంకు రూ.లక్ష, ఎం.గజేంద్ర రూ.50 వేలు, జి.మత్తయ్య రూ.50 వేలు, ఎన్‌.సుమిత్ర రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)