Breaking News

అమర జవాన్‌కు ఆఖరి వందనం 

Published on Thu, 08/03/2023 - 04:05

పాములపాడు:  ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్‌ సిరిగిరి సురేంద్ర (24) అంత్యక్రియలు ముగిశాయి. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. కశ్మీర్లోని బారాముల్లా ఆర్మీ బెటాలియన్‌ యూనిట్‌ నంబర్‌ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31న జరిగిన మిలిటెంట్‌ ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా కృష్ణానగర్‌కు తీసుకువచ్చారు.

బుధవారం కృష్ణానగర్‌ గ్రామానికి నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, తహశీల్దార్‌ రత్నరాధిక, ఎంపీడీవో గోపీకృష్ణ చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు భౌతికకాయంపై జాతీయ పతాకాన్ని కప్పి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ రామాంజనాయక్‌ ఆధ్వర్యంలో ఏఆర్‌ బృందం 3 సార్లు గాల్లోకి కాల్పులు జరపగా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

సురేంద్ర కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్థర్‌ తెలిపారు. దేశం కోసం తమ చిన్న కుమారుడు సురేంద్ర ప్రాణాలు వదిలాడని, తమను పోషించాల్సిన బాధ్యత పెద్ద కుమారుడిపై ఉందని, అతడికి ఉద్యోగం కలి్పంచాలని తల్లిదండ్రులు సుబ్బయ్య, సుబ్బమ్మ కోరారు.  

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు