Breaking News

మీరు మారరా? ఎక్కడ చూడు కొట్టుకోవడమే..

Published on Wed, 01/14/2026 - 13:09

ప్రకాశం జిల్లా: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య గలాటా జరగటంతో బస్సు డ్రైవర్‌ మహిళలను పోలీస్‌స్టేషన్‌ సమీపంలో దింపి వెళ్లిపోగా ఎస్సై మహిళల మధ్య సర్దుబాటు చేసి వేరే బస్సుల్లో పంపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి సింగరాయకొండలో జరిగింది. 

స్థానికుల కథనం మేరకు కావలి, రామాయపట్నం ప్రాంతాలకు చెందిన మహిళలు సింగరాయకొండ లోని బంధువుల ఇళ్లకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఒంగోలు–కావలి బస్సులో వెళుతుండగా సీటు విషయమై మహిళల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.  ఈ క్రమంలో ఒక మహిళ అసభ్యంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సుమారు 10 మంది వరకు మహిళలను దింపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

ఈ విషయం తెలుసుకున్న ఎస్సై బి.మహేంద్ర హుటాహుటిన మహిళల వద్దకు వచ్చి వారిని శాంతపరచి వీరిని వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ఉచిత బస్సుల వల్లే ఈ ఘటనలు ఎక్కువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.  

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)