Breaking News

కడపలో మహిళా హెచ్‌ఎం ఆత్మహత్యాయత్నం

Published on Sat, 02/07/2026 - 05:47

కడప అర్బన్‌: కడపలోని మున్సిపల్‌ హై స్కూల్‌ (మెయిన్‌)­లో ఇన్‌చార్జి హెచ్‌ఎంగా పనిచేస్తున్న జింకా జమీమా సుందరం (49) శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు.పోలీసులు, బాధితురాలి బంధువులు, సహచర ఉపాధ్యాయులు అందించిన వివరాలు.. జింకా జమీమా సుందరం, ఆమె భర్త పుష్ప రాజు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. వారు ఐఐటీల్లో చదువుతున్నారు. కొన్నేళ్లు­గా మున్సిపల్‌ హైసూ్క­ల్‌ మెయిన్‌లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జమీమా సుందరం ఇటీవల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. 

ఉపాధ్యాయులు, సిబ్బంది  రికార్డుల వ్యవహారాలు, జీతభత్యాల నిర్వహణ వంటి బాధ్యతలతో పని ఒత్తిడి పెరిగింది. భర్త  పుష్ప రాజ్‌ మొద­ట్లో రికార్డుల నిర్వహణలో సహాయం చేసినా.. ఇటీవల పట్టించుకోకపోవడంతో  మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో హెచ్‌ఎం జమీమా సుందరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు వాయిస్‌ మెసే­జ్‌ పాఠశాల గ్రూప్‌లో పెట్టడంతో సహచర ఉపాధ్యాయులు వెంటనే ఇంటికి వెళ్లా­రు. 

వేలాడుతున్న ఆమెను కిందికి దించి ఎర్రముక్కపల్లె రహదారి­లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డీఈవో షంషుద్దీన్, ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కడప వన్‌ టౌన్‌ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. పని ఒత్తిడా.. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యకు యతి్నంచారా అన్నది తేలాల్సి ఉంది.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)