Breaking News

బస్తా యూరియా కోసం వెళ్తే.. నిండు ప్రాణం బలి

Published on Sat, 07/11/2026 - 03:21

నందిగాం: యూరియా కోసం రైతు సేవా కేంద్రా­నికి(ఆర్‌ఎస్‌కే) వెళ్లి ఓ మహిళా రైతు ప్రాణాలు కోల్పోయింది. గంటల తరబడి నిరీక్షించి అసువు­లుబాసింది. ఈ విషాదకర ఘటన రాష్ట్ర వ్యవసా­య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో చోటుచేసుకోవడం గ­మనార్హం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక­వర్గం నందిగాం మండలంలోని పెద్దలవునిపల్లి రైతు సేవా కేంద్రంలో శుక్రవారం యూరియా పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన  రై­తు యాప్‌ ద్వారా యూరియాను పంపిణీ చేసేందుకు భూమి ఉన్న ప్రతి రైతు ఆర్‌ఎస్‌కేకు తప్ప­ని­సరిగా రావాల్సి ఉంటుంది. దీంతో పెద్దలవుని­పల్లికి చెందిన పినకాన కాంతమ్మ(70) తన కుమార్తెతో కలిసి ఆర్‌ఎస్‌కేకు వెళ్లింది. 

అప్పటికే పంపిణీ ప్రారంభించిన ఆర్‌ఎస్‌కే సిబ్బంది.. రైతులకు స్లిప్పులు రాయడం, యాప్‌లో నమోదు చేయడం.. డబ్బులు తీసుకోవడం వంటివి చేస్తు­న్నారు. గంటల తరబడి నిరీక్షించిన కాంతమ్మ స్లిప్పు రాయించుకుని, బయోమెట్రిక్‌ వేయించుకుని ఒక బస్తా యూరియాతో బయటికొచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పక్కన ఉన్న రైతులు సపర్యలు చేస్తూ 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలిస్తుండగా కాంతమ్మ ప్రాణాలు కోల్పోయింది. యూరియా కోసం వచ్చిన రైతు­లంతా ఆర్‌ఎస్‌కేలోనే ఉండటం, గది కిక్కి­రిసిపోయి.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యామంటూ మిగతా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.  

ప్రభుత్వానికి సిగ్గుచేటు: పేరాడ తిలక్‌
మహిళా రైతు మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ టెక్కలి ఇన్‌చార్జ్‌ పేరాడ తిలక్‌  హుటాహుటిన ఆర్‌ఎస్‌కే వద్దకు చేరుకున్నారు. యూరియా పంపిణీ తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లకపోవడాన్ని ప్రశ్నించారు. వ్యవసాయశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ఇంతటి దారుణ ఘటన చోటుచేసుకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.  

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)