Breaking News

బీటెక్‌ విద్యార్థుల ప్రేమ ‘పంచాయితీ’

Published on Sat, 03/08/2025 - 11:19

తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడటం.. జీవితంలో స్థిరపడకుండానే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం తమ విజయంగా భావించడం యువతకు పరిపాటిగా మా రింది. ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తె సంతోషాన్నే కోరుకుంటారు. ఆడ..పిల్ల అయినప్పటికీ ఆ గజ్జెల సవ్వడితో మురిసిపోతారు. ఇలాంటి అమ్మానాన్నలు.. ప్రేమ వాకిట్లో కానివాళ్లుగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మూడు రోజులుగా ఆ తండ్రి వేదన వర్ణనాతీతం. కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె నిన్న మొన్న పరిచయమైన ప్రేమకునితోనే ఉంటానని చెప్పడం ఆ హృదయాన్ని కలచివేసింది. కాళ్లావేళ్లా పడినా.. వాళ్లతో వీళ్లతో చెప్పించినా.. కుమార్తె మనసు కరగకపోవడంతో ఆ తల్లిదండ్రుల మనసు గాయపడింది.

ప్రేమించడం తప్పుకాదు.. పెళ్లి చేసుకోవడం నేరం అంతకన్నా కాదు. కానీ పెద్దలను ఒప్పించి చేసుకున్నప్పుడే ఆ ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుంది. ఇటీవల కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు చిన్న చిన్న వివాదాలతో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం చూస్తే.. ఏ తల్లిదండ్రులకై నా ప్రేమ పెళ్లి గుండెను బరువెక్కించక మానదు.

కర్నూలు: బేతంచర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన రాజేష్‌నాయుడు, మాధురిబాయి ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆరా తీస్తే విషయం బయటపడింది. మాధురిబాయి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విన్నపం మేరకు త్రీటౌన్‌ పోలీసులు బుధవారం రాత్రి ప్రేమ జంటను స్టేషన్‌కు రప్పించారు. అయితే ఇరువురూ ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు రాత పూర్వకంగా అంగీకరించారు. గురువారం ఉదయం తిరిగి ఇరువురి తరపు బంధువులు స్టేషన్‌లో పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై శుక్రవారం ఉదయం గ్రామంలో యువకుడి ఇంటి ముందు తమ కుమార్తెను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

టూటౌన్‌ పోలీస్టేషన్‌లో మూడో రోజు..
ఇదిలా ఉండగా గ్రామం నుంచి పంచాయితీ కోసం వచ్చిన ఇరువురి కుటుంబాలను పోలీసులు టూటౌన్‌కు రప్పించారు. అక్కడ సీఐ ఇస్మాయిల్‌, త్రీటౌన్‌ సీఐ కంబగిరిరాముడు కలిసి ప్రేమ జంటను పెద్దల ఎదుట నిలబెట్టారు. యువతి తను ప్రేమించిన యువకుడితోనే వెళ్లిపోతానని తెగేసి చెప్పడంతో యువతి తండ్రి కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)