Breaking News

తండ్రి మరణంలోనూ కుమార్తెకు ‘పరీక్ష’!

Published on Tue, 03/18/2025 - 13:27

అన్నమయ్య జిల్లా: తండ్రి మరణించడంతో పుట్టెడు దుఃంఖంలోనూ ఆ విద్యార్థిని పది పరీక్షలకు హాజరైంది. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కందుకూరు పంచాయతీ గొడుగు వారి పల్లికి చెందిన కొత్తోళ్ల వెంకట్రమణ(55) ఆదివారం చింతచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆయన భార్య పదేశ్ల కిందటే అదృశ్యమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు గణేష్, కుమార్తె గిరిజ. అయితే దుఃఖాన్ని దిగమింగుకుని గిరిజ సోమవారం పదో తరగతి పరీక్షలకు హాజరైంది. పరీక్షల అనంతరం తండ్రి కడచూపు కోసం కన్నీటితో ఇంటికి వెళ్లింది. 

మద్యం మత్తులో ఎంఈవో!
ఓ వైపు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నా ఆ ఎంఈవో మాత్రం మద్యం మత్తులో మునిగితేలుతున్నాడు. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శివనాగేశ్వరరావు ఉలవపాడు–1 ఎంఈవోగా ఉన్నారు. ఆయన సోమవారం వి«ధి నిర్వహణలో ఉండగానే యథేచ్ఛగా మద్యం తాగారు. ఉదయం 9.30 నుంచి స్థానికంగా ఉన్న బ్రాందీషాపు పక్కనే ఉన్న దుకాణం వద్ద కూర్చుని దాదాపు గంట సేపు మద్యం తాగారు.  

అంతేకాదు.. రాత్రి వేళల్లో ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే నివాసం ఉంటూ.. రాత్రివేళ పాఠశాలలో సైతం మద్యం తాగుతుంటారని స్థానికులు, విద్యార్థులు చెబుతున్నారు. అదేమంటే.. తనకు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మిత్రుడని.. చెబుతుండటంతో ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయులు, చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సైతం వెనుకాడుతున్నారు. 
                   

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)