Breaking News

బిడ్డ కోసం తండ్రి పాట్లు

Published on Wed, 06/19/2024 - 05:29

మహారాణిపేట(విశాఖ దక్షిణ): పసిబిడ్డ కోసం తండ్రి నానా కష్టాలు పడ్డాడు. ప్రసవం అయిన తర్వాత చికిత్స కోసం పిల్లల వార్డుకు తీసుకొని వెళ్లడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో తండ్రి ఆక్సిజన్‌ సిలిండర్‌ మోసుకొని వార్డుకు తీసుకొని వెళ్లాడు. పసిబిడ్డను ఆయా తీసుకొని వెళ్లగా తండ్రి సిలిండర్‌ మోసుకొని వెళ్లాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానంద్‌ ఆరా తీశారు. 

కాకినాడ జిల్లా కోటనందూరుకి చెందిన అల్లు శిరీష, విష్ణుమూర్తి దంపతులు. శిరీష ఈ నెల 9న కేజీహెచ్‌ గైనిక్‌ వార్డులో చేరారు. మంగళవారం ఉదయం 8.30 శిరీష పసికందుకు జన్మనిచ్చి0ది. పసికందు అనారోగ్యానికి గురవడంతో పిల్లల వార్డులో ఉన్న ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు. 

పసికందును గైనిక్‌ వార్డుకు తరలించడానికి కేజీహెచ్‌ సిబ్బంది ఎవరు ముందుకు రాలేదు. దీంతో తండ్రి విష్ణుమూర్తి అక్కడ ఉన్న ఆయాతో మాట్లాడి తాను సిలిండర్‌ మోస్తానని ముందుకు వచ్చాడు. దీంతో ఆయా పసిపాపను, తండ్రి సిలిండర్‌ మోసుకొని వెళ్లారు. గైనిక్‌ వార్డు నుంచి పిల్లల వార్డు వరకు నడిచి తీసుకొని వెళ్తున్న ఈ దృశ్యాన్ని కొంత మంది వీడియో తీశారు. దీనిని వైరల్‌ చేయడంతో ఈ విషయం బయట పడింది. 



గైనిక్‌ వార్డు వద్ద బ్యాటరీ కారు   
ఈ ఘటన వైరల్‌ కావడంతో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానంద్‌ ఆరా తీశారు. గైనిక్, పిల్లల వార్డు సిబ్బందిని పిలిచి విచారించారు. ఆ సమయంలో ఎవరు డ్యూటీలో ఉన్నారు.. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అన్నదానిపై చర్చించారు. ఈ సమస్య లేకుండా గైనిక్, పిల్లల వార్డు వద్ద ఒక బ్యాటరీ కారు సిద్ధం చేస్తున్నట్లు శివానంద్‌ తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)