Breaking News

మా శవాలపై వెళ్లి భూములు తీసుకోండి

Published on Mon, 06/30/2025 - 03:35

ఉలవపాడు/సాక్షి, అమరావతి: ‘తరతరాలుగా ఈ భూములే మాకు జీవనాధారం. సోలార్‌ కంపెనీకి మా భూములు ఇచ్చేది లేదు. మేం బతికుండగా సెంటు భూమి కూడా ఇవ్వం. ప్రభు­త్వం వెనక్కి తగ్గకపోతే మా శవాల మీదుగా వెళ్లి భూములు తీసుకోవాల్సి ఉంటుంది’ అని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు రైతులు తేల్చి చెప్పారు. కరేడు గ్రామానికి చెందిన 8,348 ఎకరాల భూమిని ఇండోసోల్‌ సోలార్‌ పీవీ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌కు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చింది. 

భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు భూసేకరణకు మొగ్గుచూపడంతో ఆదివారం కరేడు ర్యాంపు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించా­ల­ని రైతులు పిలుపునిచ్చారు. పోలీసులు ఈ కార్యక్ర­మాన్ని భగ్నం చేసేందుకు ఆంక్షలు విధించా­రు. ముందస్తుగా గ్రామానికి చెందిన రైతు నేత మిరి­యం శ్రీనివాసులుని అరెస్టు చేశారు.  

భారీ బందోబస్తు... అడుగడుగునా ఆంక్షలు 
ఆదివారం ఉదయం కరేడు ర్యాంపు వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి ఎవరూ బయటకు రా­కుండా ప్రతి వీధిలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. భూ­ములు కోల్పోతున్న రైతులు, వారికి అండగా గ్రామస్తులు బైకులు, ట్రాక్టర్లలో దాదాపు రెండు వేల మంది ర్యాంప్‌ వద్దకు రావడంతో పోలీసులు బారికేడ్లు, రోప్‌లతో అడ్డుకున్నారు. ముందుగా వచ్చిన రైతులను అదుపులోకి తీసుకున్నారు. సబ్‌కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ రైతులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు.

‘మా భూములు పోతే ఎవరు తిరిగిస్తారు. ఎవరో పెద్ద వ్యక్తులకు మా భూములు మీరు ఎలా ఇస్తారు?’ అని సబ్‌ కలెక్టర్‌ను ప్రశ్నించారు. గంటపాటు పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. రైతులు జాతీ­య రహదారిపైకి వెళ్లకుండా పోలీసు వాహనా­లు, లారీలు అడ్డుపెట్టారు. అయినా వారు పొలా­ల్లో నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. కరేడు నుంచి మహిళా రైతులు భారీగా తరలివచ్చి రహదారిపై బైఠాయించారు. ఐదు కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో మళ్లీ సబ్‌ కలెక్టర్‌ శ్రీపూజ వచ్చి రైతులతో చర్చలు జరిపారు.

ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. కాగా, నిరసన తెలి­పిన ప్రజల నిర్బంధం, వారికి మద్దతుగా వెళ్లిన నాయకుల అక్రమ అరెస్టులను సీపీఐ, సీపీఎం తీవ్రంగా ఖండించాయి. రాస్తా­రోకో చేసిన 38మంది రైతులు, నేతలపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అంకమ్మ తెలిపారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)